గత కొంత కాలంగా భారత దేశంలో రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు జరుగుతున్నాయి.  ముఖ్యంగా ఎన్నికల హడావుడితో అన్ని పార్టీల సభ్యులు వారి ప్రత్యర్థి పార్టీలపై సంచలన వ్యాఖ్యాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.  ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కి మద్య వార్ నడుస్తూనే ఉంది.  తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి  ప్రియాంక వాద్రా రాజకీయ అరంగేట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావడం చూస్తుంటే ఎన్ని సున్నాలు కలిసినా మొత్తం సున్నాయే అయ్యేదన్నారు.
Image result for priyanka gandhi
ఇప్పుడు సున్నా, సున్నా కలిసినంత మాత్రాన వంద అవుతుందా?  అంటూ పంచ్ విసిరారు. ఈ మద్య ప్రియాంకకు ఉత్తరప్రదేశ్‌ ఈస్ట్ బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఇక ప్రియాంక గాంధీ ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు కాంగ్రెస్ వారు ప్రత్యేకంగా ఆమెను పొగుడుతున్నారు...మరి 014- 2017లో జరిగిన ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేసిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. 
Image result for priyanka gandhi
అప్పట్లో ప్రియాంక వస్తుంది.. ప్రచారం చేస్తుందని.. కాంగ్రెస్ రాజకీయాల్లో ఎన్నో మార్పులు తెస్తుందని వ్యాఖ్యానించారు..కానీ ఆమె రావడం కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఆమె రాజకీయ ప్రవేశం వల్ల ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండదని జోస్యం చెప్పారు. 'కాకపోతే ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీకి ఒక సున్నాయే ఉంది, ఇప్పుడు రెండో సున్నా జతకలిసింది, అంతే' అని ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: