మరి కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2019-2020 కి సంబంధించిన బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ఈ సంవత్సరం రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎంత ఆసక్తి నెలకొందో గత సంవత్సరం బడ్జెట్ కూడా అందరి దృష్టిని అటువైపుకు తిప్పుకుంది. 2018-2019 సంవత్సరానికి గాను కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టినపుడు అందరినీ ఆకర్షించిన విషయం ఏమిటంటే, జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత రాబోయే మొట్టమొదటి బడ్జెట్ కావడమే.
Related image
గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అరుణ్ జైట్లీ కేంద్ర ఆదాయాన్ని దాదాపు 2,400 కోట్లు ఆశించగా, ఖర్చుని 2,920 కోట్లకు అంచనా వేశారు. ఇక పోతే అభివృద్ధి కార్యక్రమాల ఖర్చుకి 2,442,213 కోట్లను కేటాయించగా దానిలో 5 శాతం పన్ను మినహాయింపు కింద దాదాపు 250 కోట్లు టర్నోవర్ జరుగుతుందని అన్నారు. ఇక అప్పులు చెల్లించేందుకు 575,795 కోట్లను కేటాయించడం జరిగింది. 
Image result for budget in india
ఇకపోతే జీఎస్టీ రాకతో అందరూ ఊహించిన విధంగా వేతనదారులకు పన్నులో కొంత మినహాయింపును అందించగా మరో పక్క కార్పొరేట్ ట్యాక్స్  కూడా కొంతవరకు తీసివేయడం జరిగింది. ఇక “నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీం” కింద దాదాపు పది కోట్ల కుటుంబాలకు అయుష్మాన్ భారత్ అనే వైద్య విధానాన్ని ప్రవేశపెట్టడం చెప్పుకోదగ్గ అంశం. వేతనదారుల పన్ను బదులుగా నేరుగా వారి రవాణా మరియు వైద్య ఖర్చుల కోసం 40,000 రూపాయలను వారి జీతాల నుండి తీసుకొనుటకు ప్రతిపాదించారు. ఆధునీకరణకు 99,563 కోట్లను ఇవ్వగా, భద్రతా విభాగానికి 195,947 కోట్ల రూపాయలను కేటాయించారు.
Image result for budget in india
గత సంవత్సరం మామూలు ఆదాయ పన్నులో ఎలాంటి రాయితీ ఇవ్వకపోగా దానిని 3 నుండి 4 శాతానికి పెంచారు. పార్లమెంటు సభ్యుల జీతాలను రెండింతలు చేయగా, రాజధాని ఢిల్లీ లో కాలుష్య నివారణకు ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించారు. ఇలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన ప్రవేశాలతో చేసినా దాదాపు బడ్జెట్ పల్లె ప్రజలను దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం బడ్జెట్ రూపొందించారనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: