రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు తెర‌మీదికి వ‌స్తాయో చెప్ప‌డం క‌ష్టం. ముఖ్యంగా అప‌ర చాణిక్యుడు వంటి చంద్ర‌బాబు నిమిషానికో వ్యూహంతో రాజ‌కీయ తెర‌పై చిత్ర‌మైన రంగులు వేస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ధ‌ర్మ‌పోరా టం అంటూ హడావుడి చేశారు. ఖ‌చ్చితంగా తన పుట్టిన రోజు నాడే ఆయ‌న ధ‌ర్మ‌పోరాటానికి తెర‌దీసి సంచ‌ల‌నం సృష్టిం చారు. అదేవిధంగా త‌న‌కు వ్య‌తిరేకత వ‌స్తుంద‌ని తెలిసిన ప్ర‌తి క్ష‌ణాన్ని కూడా ఆయ‌న త‌న‌కు అనుకూలంగా మ‌లుచు కుని పార్టీలోని సీనియ‌ర్ల‌కు కూడా అంద‌ని వ్యూహాత్మ‌క ధోర‌ణిని అనుస‌రించారు. నిజానికి ఇన్ని వ్యూహాలు గ‌తంలో ఆయ‌న వ‌రుస‌గా తొమ్మిదేళ్లు పాలించిన స‌మయంలోనూ లేవంటే అతిశ‌యోక్తి అనిపించ‌క‌మాన‌దు. 


వాస్త‌వానికి అప్ప‌టి రాజ‌కీయాలు, రాజ‌కీయ నేత‌ల‌తోపోల్చుకుంటే.. ఇప్పుడు చంద్ర‌బాబు ముందున్న వారు ప్ర‌తి ఒక్క రూ జూనియ‌ర్లే. కానీ, ఎందుకో చంద్ర‌బాబు వీరిని పెద్ద‌గా భావిస్తుండ‌డం, వారేదో పెద్ద రాజ‌కీయాలు చేసేస్తారని గ‌ణించు కోవ‌డం వంటి ప‌రిణామాలు కొంత విస్మ‌యం క‌లిగిస్తున్నాయి. అయితే, చిన్న‌పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్ట‌మ‌న్న చందంగా చంద్ర‌బాబు చిన్న స్థాయి నాయ‌కుల‌ను కూడా పెద్ద వ్యూహంతోనే చిత్తు చేయాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి ఓ రేంజ్‌లో ఊపందుకుంది. అయితే, మ‌రో రెండు మాసాల్లో ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న నేప‌థ్యంలో ఈ వేడి మరింత సెగ పుట్టే అవ‌కాశం ఉంది. దీనిని గ్ర‌హించిన చంద్ర‌బాబు చెల్లెలి సెంటిమెంటును తెర‌మీదికి తెచ్చారు. 


నిజానికి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనే అయితే, అప్ప‌ట్లో ఆయ‌న ఇంత ప్రియార్టీ ఇవ్వ‌లేదు. అంతెందుకు గ‌డిచిన ఏడాదిన్న‌ర కింద‌టి ప‌రిస్థితిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నా ఈరేంజ్‌లో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేసింది కూడా లేదు. 2014 స‌మ‌యంలో ఒక‌సారి , మ‌ళ్లీ ఇప్పుడు చంద్ర‌బాబు చెల్లెలి సెంటిమెంటును తెర‌మీదికి తెచ్చారు త‌న‌కు ఇప్పుడు ఏకంగా 94 ల‌క్ష‌ల మంది అక్క చెల్లెల్లు ఉన్నార‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం ద్వారా సంచ‌ల‌న సెంటిమెంటుకు తెర‌దీశారు.

నిజానికి ఇది చంద్ర‌బాబునుంచి డ్వాక్రా మ‌హిళ‌లు ఊహించ‌ని ప‌రిణామం. అదేస‌మ‌యంలో ప్ర‌తి రూపాయికి లెక్క‌లు వేసి ఖ‌ర్చు చేసే చంద్ర‌బాబు ఏకంగా వీరికి 9 వేల కోట్ల రూపాయ‌ల పైచిలుకు మొత్తాన్నిఉదారంగా అందిస్తున్నారు. దీంతో ఈ సెంటిమెంటు ఖచ్చితంగా ప‌నిచేస్తుంద‌ని టీడీపీ నాయ‌కులే చెబుతున్నారు. మ‌రి ఈ చెల్లెలి సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే.. ఇక‌, టీడీపీకి తిరుగుండ‌ద‌న‌డంలో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: