2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్ర బాబు కు పొత్తులు అనివార్యం అయినాయి. టీడీపీ చరిత్ర లో ఎప్పడూ ఒంటరిగా వెళ్ళలేదు కదా అందుకే ఈ సారి ఏం చెయ్యాలని బాబు తెగ మధన పడుతున్నాడు. అయితే పాపం చంద్రబాబు పప్పులు ఉడికే పరిస్థితే కన్పించడంలేదు. పవన్‌కళ్యాణ్‌ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు. కేసీఆర్‌తోనూ, కేటీఆర్‌తోనూ మంతనాలు కూడా జరిపారు. ఇదంతా గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన 'ఎట్‌ హోం' కార్యక్రమంలోని సందడి. నిజానికి నరసింహన్‌ రెండు తెలుగు రాష్ట్రాలకీ గవర్నర్‌ గనుక.. ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఈ ఎట్‌ హోం కార్యక్రమానికి హాజరవుతారు. గతంలో చంద్రబాబూ హాజరయ్యారు.. కేసీఆర్‌తో మంతనాలూ జరిపారు. 

Image result for pavan kalyan janasena

ఎడమొహం పెడమొహంగా చంద్రబాబు, కేసీఆర్‌ వున్నప్పుడు ఇదే గవర్నర్‌ నరసింహన్‌.. ఇద్దరినీ కలిపిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ఆయన పెద్దరికం ఆయన చూపించారు. ఆ తర్వాత కేసీఆర్‌ - చంద్రబాబు కొన్నాళ్ళు కలిసే వున్నారు.. మళ్ళీ విడిపోయారు. అది వేరే సంగతి. కేటీఆర్‌, వైఎస్‌ జగన్‌ ఇంటికి వెళ్ళి ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించిన ఆలోచనల్ని పంచుకుంటేనే చంద్రబాబుకి మండిపోయింది. అలాంటిది ఎట్‌ హోంలో పవన్‌కళ్యాణ్‌, కేసీఆర్‌ని కలిశాక ఊరుకుంటారా.? ఛాన్సే లేదు. 

చంద్రబాబుకి ఝలక్‌ ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌.?

పవన్‌కళ్యాణ్‌తో పొత్తు కోసం చంద్రబాబు ఇప్పుడు నానా తంటాలూ పడుతున్నారు. ఈ టైమ్‌లో పవన్‌ - కేసీఆర్‌ కలయిక చంద్రబాబుకి మింగుడుపడే విషయమే కాదు. అలాగని పవన్‌ని చంద్రబాబు తిట్టనూ లేరు. కుడితిలో పడ్డ ఎలకలా తయారైందిప్పుడు చంద్రబాబు పరిస్థితి. దేన్నయినాసరే అందరూ తన కళ్ళతోనే చూడాలనే నైజం చంద్రబాబుది. అదే ఆయన్ని రాజకీయంగా దిగజార్చేస్తూ వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: