వైస్సార్సీపీ అధినేత జగన్ మీద వంగవీటి రాధా ప్రెస్ మీట్ లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దింతో ఇది రాజకీయంగా ప్రకంపనలు రేపింది. అయితే రాధా వ్యాఖ్యలకు వైసీపీ నాయకులూ కౌంటర్ ఇచ్చారు . అయితే జగన్ ఎలా స్పందిస్తాడని అందరూ సర్వత్రా ఎదురు చూశారు. అయితే జగన్ ఒక కార్య క్రమం లో రాధా ఎక్కడున్నా బాగుండాలని అని అన్నాడు. అంతే అంతకు మించి ఒక్క విమర్శ కూడా చేయలేదు. దీనితో ప్రత్యర్థి వర్గాలు కూడా డిఫెన్స్ లో పడ్డారు. అయితే చాలా మంది విశ్లేషకులు జగన్ లోని రాజకీయ పరిణితి కి ఇది నిదర్శనమని అంటున్నారు. 

Image result for jagan and vangaveeti radha

అయితే వంగవీటి  టీడీపీ లో పార్టీలో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ అదేగానీ నిజమైతే ఎమ్మెల్సీ పదవి కోసం రాధా పార్టీ మారడం అవసరమా అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మంత్రి పదవి ఇస్తారో.. లేదో సందేహమే. టీడీపీ మళ్లీ గెలిచి వంగవీటి రాధాకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నా దేవినేని కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఎమ్మెల్యే బోండా ఉమా కూడా తనకు మంత్రి పదవి దక్కలేదనే కారణంగా గతంలోనే పార్టీపై ఆరోపణలు చేసి.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు.

Image result for jagan and vangaveeti radha

ఇన్ని అవరోధాలు దాటి వంగవీటి రాధాకు మంత్రి పదవి దక్కుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వైసీపీలో ఉంటే ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యే పదవి దక్కేదని - టీడీపీలో చేరితే వంగవీటి రంగా నిజమైన అభిమానుల నుంచి కూడా రాధా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా వైసీపీని వీడిన రాధా టీడీపీలో చేరే విషయంలో డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఇంత చేసి ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే జనంలో చులకన అవుతానేమోనన్న భావన కూడా రాధాను వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరాలన్న ఆలోచనపై పునరాలోచిస్తారో లేక పసుపు కండువా భుజాన వేసుకుంటారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది

మరింత సమాచారం తెలుసుకోండి: