తెలుగు సినిమా రంగంలో 1970 - 80 దశకంలో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్ ఎంజాయ్‌ చేసిన జయప్రద ఒ తెలుగు నటిగానే కాకుండా దక్షిణాదితో పాటు హిందీలో పలువురు అగ్రహీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రల్లో నటించిన ఘనత సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఆ పార్టీ తరపున 1996లో రాజ్యసభకు ఎన్నికై ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసి వరుస విజయాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం స్పెషల్ ఎట్రేక్షన్‌గా నిలిచారు. ఎన్టీఆర్‌ పిలుపుతో 1994 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద ఎన్టీఆర్‌ నాడు ఎమ్మెల్యే సీటు ఆఫర్‌ చేసినా తిరస్కరించారు. 1996లో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయిన జయప్రద ఆ తర్వాత రాజ్యసభకు గుడ్‌బై చెప్పి ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున రాంపూర్‌ నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరసగా ఎంపీగా ఘన విజయం సాధించారు. 

Image result for ysrcp

ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన అమర్‌సింగ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన జయప్రద ఆ తర్వాత ఎస్పీ నుంచి సైతం బయటకు రావాల్సి వచ్చింది. ఇక కొద్ది రోజులుగా జయప్రద తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబుతో విభేదాల కారణంగానే టీడీపీ నుంచి దూరమైన జయప్రద ఇప్పుడు ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా లేరు. ఈ క్రమంలోనే జయప్రద వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీనే తన పొలిటికల్‌ రీ ఎంట్రీకి సరైన పార్టీ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా జయప్రద వైసీపీలో చేరి ఆమె సొంత  ఊరైన రాజమహేంద్రవరం నుంచే ఆ పార్టీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. జయప్రద రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా పోటీ చేస్తే లోకల్ ఫీలింగ్‌తో పాటు, సినీ గ్లామర్‌, వైసీపీ వేవ్స్‌ అన్నీ తనకు కలిసి వస్తాయన్న నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. 

Related image

జగన్‌ రాజమహేంద్రవరం లోక్‌సభ సీటును బీసీలకు ఇస్తానని ఇప్పటికే ప్రకటన చేశారు. ఆ వర్గానికి చెందిన మార్గాని భరత్‌ను అక్కడ కోఆర్డినేటర్‌గా నియమించారు. ఇక జయప్రద కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఇప్పుడు ఆ సీటుపై కన్నేసి ఆమె వైసీపీలోకి వెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. జయప్రదకు ఎంపీ సీటు ఇస్తే ప్రస్తుతం ఎంపీ కోఆర్డినేటర్‌గా ఉన్న మార్గాని భరత్‌కు రాజమహేంద్రవరం సిటీ లేదా రూరల్‌ నియోజకవర్గాల్లో ఏదోక అసెంబ్లీ సీటు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎంపీగా టీడీపీకి చెందిన సీనియర్‌ నేత, సీనియర్‌ నటుడు మాగంటి మురళీ మోహన్‌ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే రంగంలో ఉంటే అన్ని విధాలా ఆయనకు పోటీ ఇచ్చే అభ్యర్థిగా జయప్రద అయితేనే సరైన అభ్యర్థి అవుతారని వైసీపీలో కొందరు నేతలు భావిస్తున్నారు. 


ఈ క్రమంలోనే పార్టీలో కొందరు ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. జయప్రద రాజమహేంద్రవరం నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తే ఆ ప్రభావం ఉభయగోదావరి జిల్లాలతో పాటు బీసీ సామాజికవర్గాల్లో వైసీపీకి ప్లస్‌ అవుతుందన్న అంచనా కూడా ఆ పార్టీ కీలక నేతల్లో ఉంది. మరి ఫైనల్‌గా జయప్రద పొలిటికల్‌ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో కొద్ది రోజులు వేట్‌ చేస్తేగాని క్లారిటీ వచ్చేలా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: