గణతంత్ర దినోత్సవం సాయంత్రం గవర్నర్ ఇచ్చే ఎట్ హోమ్ తేనీటి విందు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ విందుకు జనసేన పార్టీ అధినేత హాజరుకావడం ఆసక్తిరేపింది. ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పవన్ కల్యాణ్‌తో చాలాసేపు మాటామంతీ జరపడం ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.



పవన్ కల్యాణ్ తో గవర్నర్ నరసింహన్ కూడా కొద్దిసేపు ఏకాంతంగా మంతనాలు జరపడం చర్చకు దారి తీసింది. ఇటీవలే పవన్ కల్యాణ్ మంగళగిరిలోని ఓ సభలో మాట్లాడుతూ కేసీఆర్, జగన్ ల పై విమర్శలు గుప్పించారు. వీరిద్దరూ కలిసి ఏపీని ఏం చేస్తారోనని భయమేస్తోందని తీవ్రంగా కామెంట్ చేశారు.



ఈ నేపథ్యంలో కేసీఆర్, పవన్ కల్యాణ్ మంతనాలు ఆసక్తిరేపుతున్నాయి. ఐతే.. ఈ భేటీలో ఎక్కువ సేపు కేసీఆర్ మాట్లాడటం కనిపించింది. పవన్‌ కల్యాణ్‌ కేసీఆర్ చెప్పేది ఆసక్తిగా వినడం.. అప్పుడప్పుడు సమాధానం చెప్పడం కనిపించింది. కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రంట్ వివరాలు పవన్ కు చెప్పి ఉండొచ్చని భావిస్తున్నారు.



ఇటీవల జగన్‌తో బేటీ అయిన కేటీఆర్.. ఆ సమావేశం వివరాలను పవన్ కల్యాణ్‌తో పంచుకునే అవకాశం కనిపించింది. ఏపీ రాజకీయాలపై ఇటీవల ఎక్కువగా ఆసక్తి చూపుతున్న కేసీఆర్.. ఆ అంశం గురించే పవన్ తో చర్చించినట్టు సమాచారం.. ఏపీలో అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో పవన్ కళ్యాణ్ కు సూచించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న పవన్.. రేపు ఏదైనా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుని ఉంటే.. అందుకు కేసీఆర్ సూచన కారణమని భావించే అవకాశాలు లేకపోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: