ఏపీలో మూడవ పార్టీ అంటూ దూసుకువచ్చిన సినిమా నటుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ పై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పవన్ విశాఖలో మూడు రోజుల పర్యటన చేసారు. ఓ వైపు పార్టీ నాయకులతో సమీక్షలు చేస్తూనే  కీలక భేటీగా వామపక్షాలతో ఆయన మాటా మంతీ జరిపారు. ఇదే టైంలో ఆయన‌ కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఎందుకిలా...


పెద్ద నేత‌లు చేరలేదు :


విశాఖ టూర్లో పవన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారని, పెద్ద నాయకులు పార్టీలోకి వచ్చి చేరుతారని టాక్ నడించింది.  టీడీపీ నుంచి, వైసీపీ నుంచి బిగ్ ఫిగర్లు చేరిపోతారని కూడా ఓ దశలో ప్రచారం జరిగింది. కానీ ఎక్కడా ఒక్క కండువా కూడా పడలేదు. పవన్ ఉత్తరాంధ్ర జిల్లా పార్టీ నేతలతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలకు కూడా కలవరం కలిగించేవే. టీడీపీ, వైసీపీలను ఢీ కొట్టాలంటే మనం ఇంకా బలం పెంచుకోవాలని పవన్ సూచించడం విశేషం. గెలుపు కోసం కాకుండా ప్రజల కోసం ఉంటూ పనిచేయాలని కూడా పవన్ చెప్పుకొచ్చారు. నిజానికి పవన్ చెప్పినవి బాగానే ఉన్నా పదవీ లాలసతో పార్టీలోకి వస్తున్న నేతలు సేవ అంటే ఎందుకు ముందుంటారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. \


గంటాపై విమర్శలు :


విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుపైన పవన్ చేసిన కామెంట్స్ విశాఖ జిల్లా రాజకీయాల్లో బాగా వైరల్ అయ్యాయి. గంటాను తాను చేర్చుకోలేదని పవన్ అనడంపై మత్రి వర్గీయులు గుస్సా అవుతున్నారు. గంటా వలస‌ పక్షి అని, అందుకే చేర్చుకోలేదని పవన్ కామెంట్స్ చేశారు. నిజానికి గంటా చేరుతానని అన్నరా, లేదా అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. టీడీపీలో జిల్లా రాజకీయాలను శాసిస్తున్న గంటాకు పార్టీలు మార్చే అలవాటు ఉన్నా  ముందు చూపుతో వ్యవహరిస్తారని కూడా అంటున్నారు. పవన్ మాటలను బట్టి చూసుకుంటే గంటా రాలేదని బాధతో చేశారా లేక వస్తే చేర్చుకోక పొరపాటు చేశానని భావిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. 
క విశాఖలో పెద్ద నాయకులు ఎవరూ కూడా జనసేన వైపు తొంగి చూడకపోవడం సైతం ఆ పార్టీని నిరాశలో పడవేసిందని పవన్ మాటలను బట్టి తెలుస్తోంది. పవన్ స్వయంగా పిలిచినా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీలో చేరలేదు. తటస్థులుగా ఉన్న మాజీ ఎంపీలు సబ్బం, హరి, కొణతాల రామక్రిష్ణ లాంటి వారు టీడీపీ వైపే చూస్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ టూర్లో ఆశించిన చేరికలు లేవన్న ఆవేదనే ఈ కామెంట్స్ కారణమా అన్న చర్చ సాగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: