ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న రాజకీయ విధానాలు ఏపీ రాష్ట్రానికి చేటు చేయనున్నాయా.. ఆయన రాజకీయ ఎత్తుగడలు దీర్ఘకాలంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపనున్నాయా.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వెళ్తున్న ఆయన ఏపీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ap and chandrababu కోసం చిత్ర ఫలితం


మోడీ సర్కారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి.. కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటోంది కాబట్టి చంద్రబాబు యూపీఏతో జతకడతానని చెబుతున్నారు. బాగానే ఉంది. మరి యూపీఏ సర్కారే అధికారంలోకి వస్తుందని ఏమైనా గ్యారంటీ ఉందా.. కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉందా..?

ap and chandrababu కోసం చిత్ర ఫలితం

ఒకవేళ మళ్లీ మోడీ ప్రభుత్వమే వస్తే.. ఏపీ మరో ఐదేళ్లపాటు గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసిందేనా అన్న వాదన వినిపిస్తోంది. మోడీకి గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోయినా కలిసొచ్చే పార్టీల అండతో మళ్లీ అధికారం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రాన్ని అడ్డంగా వ్యతిరేకిస్తూ పోతే ఏపీ భవిష్యత్తు అంధకారమే అవుతుంది.



ఎన్నికలకు ముందే ఏదో ఒక కూటమిలో చేరడం ద్వారా ఏపీకి లాభం చేకూర్చే అవకాశాలు సగానికి సగం తగ్గించుకున్నట్టే అవుతుంది. ఒకవేళే కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చినా యూపీఏలోని అన్ని పార్టీలు ప్రత్యేక హోదా నినాదానికి మద్దతు ఇవ్వాలని లేదు. మొత్తానికి ఎటు చూసినా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలానే కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: