సార్వత్రిక ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న వేళ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీపై ప్రత్యర్థి పార్టీల విమర్శల వర్షం జోరందుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని పార్టీ ఎన్నికల బాధ్యతలు ప్రియాంకా గాంధీ చేపట్టడంపై కాంగ్రెస్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత చిత్రం


అసలే మోడీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని.. కాంగ్రెస్ పుంజుకుంటోందని భావిస్తున్న సమయంలో రాహుల్ కు తోడుగా ప్రియాంకా కూడా పార్టీలో యాక్టివ్ రోల్ తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రియాంకను టార్గెట్ చేసుకుంటున్నాయి. ప్రముఖ వివాదాస్పద బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రియాంకపై సంచలన ఆరోపణలుచేశారు.

subramanya swamy leader కోసం చిత్ర ఫలితం


ప్రియాంకా గాంధీకి బైపోలార్ డిజార్డన్ అనే వ్యాధి ఉందని సుబ్రహ్మణ్యస్వామి చెబుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారని.. వీరి మూడ్ ఎప్పడు ఎలా ఉంటుందో చెప్పలేరని సుబ్రహ్మణ్య స్వామి చెబుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు ప్రజా జీవితంలో.. రాజకీయాల్లో ఉండకూడదని ఆయన చెబుతున్నారు.

సంబంధిత చిత్రం


ప్రియాంకా గాంధీపై ఇప్పటికే మరికొందరు బీజేపీ నేతలు కూడా ఘాటు విమర్శలు చేశారు. ఓ బీజేపీ నేత ఆమె కేవలం అందగత్తె మాత్రమే.. రాజకీయ నాయకురాలు కాదంటూ కామెంట్ చేశారు. మరి ఇలాంటి విమర్శలు ప్రియాంకా గాంధీ ప్రభను తగ్గిస్తాయా..ఆమె ప్రభావాన్ని పరిమితం చేస్తాయా.. అన్నది కాలమే నిర్ణయిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: