దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ వైసీపీలో చేరేందుకు నిర్ణయించడం ఏపీ రాజకీయాలలో ఆసక్తి రేపుతోంది. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడంతో ఈ చేరికకు అంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ చేరిక వైసీపీకి లాభం చేకూరుస్తుందని చాలామంది భావిస్తున్నారు.

daggubati and jagan కోసం చిత్ర ఫలితం


సాధారణంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వైసీపీలో చేరుతున్నారంటే అది ఆ పార్టీకి ఉన్న క్రేజ్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడే మరో మైనస్ పాయింట్ కూడా పొంచి ఉంది. దగ్గుబాటి వెంకటేశ్వరావు కుమారుడు హితేశ్ వైసీపీలో చేరినా భార్య పురందేశ్వరి బీజేపీలోనే ఉండిపోయారు.

daggubati and jagan కోసం చిత్ర ఫలితం


మరి పురంధేశ్వరి కూడా వైసీపీలోకి వస్తే జగన్ పార్టీకి ఆ చర్య లాభం చేకూరుస్తుంది. ఒకవేళ పురంధేశ్వరి బీజేపీలోనే ఉండిపోతే హితేశ్ చేరిక కూడా వైసీపీకి అంతగా లాభించకపోవచ్చు. లాభం చేకూర్చకపోగా.. వైసీపీ, బీజేపీ కుమ్మక్కుకు ఇదే ఉదాహరణ అంటూ టీడీపీ రచ్చ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.

సంబంధిత చిత్రం


తల్లి పురందేశ్వరి బీజేపీలో.. కొడుకు హితేశ్ వైసీపీలో ఉండటం వల్ల ఈ అవకాశాన్ని చంద్రబాబు అంత సులభంగా వదిలిపెట్టరు. ఇప్పటికే ఆయన వైసీపీనీ బీజేపీని ఒకే గాటన కట్టడం ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఆ విమర్శలకు హితేశ్, పురందేశ్వరి సాక్ష్యాలుగా మారతారు. అందువల్ల వైసీపీ ఇమేజ్ దెబ్బ తినే ప్రమాదం ఉంది. సో.. పురందేశ్వరి తీసుకునే నిర్ణయమే ఇప్పుడు కీలకం కాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: