జనసేనాని పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని అంటే చాలా మంది అభిమానులకు కోపం వస్తుంది. ముఖ్యంగా ఆయన గారి అన్న గారు నాగబాబుకు ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. అలా అన్నందుకే ఈ మధ్యన బాలయ్యని ఏకి పారేశారు. పాత గొడవలన్నీ తవ్వి తీశారు. ఆ దెబ్బకు బాలయ్య  డ్రీం పాజెక్ట్ ఎంటీయార్ కధానాయకుడు సైతం గల్లంతు అయింది. మరి ఇవన్నీ  తెలిసి కూడా...


నాకు పవన్ తెలియదు :


సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని పెట్టి చాలాకాలంగా జనంలో ఉంటున్నారు. అటువంటిది పవన్ తెలియదు అంటే అది నిజంగా అబద్దమైనా అనుకోవాలి. లేదా అది కూడా ఓ విమర్శగానే చూడాలి. నిజానికి చాలా మందికి చాలా మంది తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఒకే రంగంలో ఉంటున్న వారికీ, అందునా పోయిన ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉంటూ చేయి సాయం చేసిన పార్టీ నాయకుని గురించి తెలియదు అనడం విడ్డూరంగానే ఉంది. గతంలో కూడా ఈ రకమైన కామెంట్స్ ని విజయనగరం రాజా వారు అశోక్ గజపతి రాజు చేశారు. తాజాగా మళ్ళీ ఆయన అదే మాట అన్నారు. ఈసారి మరింత విపులంగా ఆయన పవన్ ఎవరో తెలియదు కానీ ఆయన అన్న చిరంజీవి తెలుసు, తండ్రి కూడా తెలుసు అంటూ చెప్పుకొచ్చారు.


వారు తెలుసు కానీ...:


మరి తండ్రి, అన్న తెలిస్తే పవన్ తెలిసినట్లే కదా.అయినా రాజుగారు తనకు ఆయన తెలియదు అనడం ఒకింత ఆశ్చర్యమే. గతంలో అశోక్ గజపతి ఇలా చేసిన కామెంట్ల మీదా చాలా కాలం పాటు పవన్ నొచ్చుకున్నారు కూడా. దానికి బదులుగా ఏకంగా విజయన‌గరం కోట వద్ద మీటింగ్ పెట్టి మరీ రాజాగారిని తన సత్తా చూపారు. అయినా సరే మళ్ళీ అదే మాట ఆయాన‌ నోటి వెంట వచ్చింది. దీన్ని ఎలా చూడాలో మరి. నిజానికి అశోక్ అన్న మాటల వెనక అర్ధాలను కూడా గమనిస్తే ఆయన పవన్ తనకు వ్యక్తిగతంగా తెలియదు అంటున్నారానుకోవాలేమో. 



నిజమే టీడీపీకి పవన్ మద్దతు ఇచ్చినంత మాత్రాన అందరు నాయకులకూ పర్సనల్ గా తెలియకపోవచ్చు. అయితే అశోక్ అలాంటి ఇలాంటి నాయకుడు కాదు, ఆయన పార్టీలో  ముందు నుంచి ఉన్నారు. పైగా కీలకమైన నేత కూడా. నేను సినిమాలు చూడను కాబట్టి పవన్ తెలియదు అని అశోక్ అనడం పైనా సెటైర్లు పడుతున్నారు. పవన్ ఇపుడు రాజకీయాల్లో ఉన్నారు. మరి. ఒకే రంగంలో ఉన్నవారు తెలియకుండా ఉంటారా. ఏది ఏమైనా రాజు గారి మాటలకు పవన్ రియాక్షన్, ఆయన అన్న నాగబాబు కామెంట్స్ చూడాలిపుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: