తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. కొన్నాళ్లుగా సైలంట్ గా ఉంటున్నారు. అసలు మీడియా ముందుకు రావడం లేదు. వచ్చినా ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. అంతే కాదు.. ఓ రెండేళ్ల వరకూ మీడియాతో మాట్లాడను అంటూ ఆ మధ్య బాంబు కూడా పేల్చారు.

revanth reddy కోసం చిత్ర ఫలితం


అంటే కొన్నాళ్లపాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే రేవంత్ రెడ్డి తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో పరాభవానికి గురై రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న రేవంత్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలో దిగాలని బావిస్తున్నట్టు సమాచారం.

revanth reddy కోసం చిత్ర ఫలితం


మరో మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నకల్లో రేవంత్ రెడ్డిని పోటీకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట. పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో దింపాలన్న ఆలోచనతో ఉందట. ఇక్కడ నుంటి టీఆర్‌ఎస్ తరపున జితేందర్ రెడ్డి బరిలో దిగే ఛాన్స్ ఉంది.

revanth reddy కోసం చిత్ర ఫలితం


మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం నుంచి పోటీకి రేవంత్ రెడ్డి కూడా సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి బయటపడి మళ్లీ రాజకీయంగా బలంగా ఉండాలంటే మరో ప్రయత్నం చేయడమే మేలని ఆయనకు అనుచరులు కూడా సూచిస్తున్నారు. కానీ మళ్లీ ఎంపీగా కూడా ఓడిపోతే పరిస్థితి దిగజారుతుందేమోనన్న శంక రేవంత్‌ ను ఆలోచింపేజేస్తోంది. మరి ఫైనల్ గా ఏం చేస్తారో..?


మరింత సమాచారం తెలుసుకోండి: