వీఐపీల ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా గ్రాండ్ గానే ఉంటుంది. ఆ ఫంక్షన్లకు వచ్చే అతిథులు కూడా ప్రముఖులే ఉంటారు. ఇందుకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు హార్మన్ పంచెల వేడుకే ఓ ఉదాహరణ. పంచల వేడుకకు కూడా సీఎం సహా పలువురు వీఐపీలు హాజరై హార్మన్ ను ఆశీర్వదించారు.



లగడపాటి రాజగోపాల్ తన కుమారుడు హార్మన్ పంచల వేడుకను విజయవాడలోని ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్లో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరవడం విశేషం. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్యేలు బోండా ఉమ, జలీల్ ఖాన్ కూడా హాజరయ్యారు.

సంబంధిత చిత్రం


వీరితో పాటు ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, గజల్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. తెలుగు దేశం నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా నేతలు హాజరయ్యారు. వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు, వైసీపీ నేత అంబటి రాంబాబు, ఉద్యోగ సంఘాల మాజీ నేత అశోక్ బాబు కూడా హార్మన్ ను ఆశీర్వదించారు.

lagadapati harman function కోసం చిత్ర ఫలితం


ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా హైదరాబాద్ నుంచి ఈ ఫంక్షన్‌కు హాజరుకావడం విశేష।ం. మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సినీ నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు హాజరయ్యారు. ఇక చివరగా ఇటీవల టీవీల్లో సందడి చేస్తున్న లలితా జ్యూయలరీ ఎంపీ కిరణ్ కుమార్ కూడా హాజరవడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: