రాబోయే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయటం దాదాపు ఖాయమైందట. జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలున్నాయి. పోయిన ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసిపి ఆరు స్ధానాల్లో గెలవగా టిడిపి ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది. చీరాల నియోజకవర్గంలో నవోదయ పార్టీ అభ్యర్ధి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి జనసేన ఎన్నికలను ఎదుర్కొనబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలా సార్లే ప్రకటించారు. అయితే, ఎక్కడో పవన్ ప్రకటనపై అందరిలోను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  

సరే ఆ విషయాన్ని పక్కనపెడితే మొన్ననే విశాఖపట్నం జిల్లాలోని భీమిలీలో సీట్ల సర్దుబాటుపై పవన్ వామపక్షాల జాతీయ నేతలతో సమావేశం కూడా అయ్యారు. అందులో భాగంగానే ప్రకాశం జిల్లాలో జనసేన ఆరు నియోజకవర్గాల్లోను వామపక్షాలు మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోను పోటీ చేయాలని స్ధూలంగా నిర్ణయించారట. జనసేన గిద్దలూరు, ఒంగోలు, దర్శి, పర్చూరి, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలపై దృష్టి పెట్టిందని సమాచారం. గిద్దలూరు నియోజకవర్గం నుండి చంద్రశేఖర యాదవ్ కు పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట,

 

మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపైన కూడా పవన్ కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో వామపక్షాలు మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నాయి. కనిగిరి, మార్కాపురం, కొండెపి నియోజకవర్గాలపై దృష్టి పెట్టగా సిపిఎం సంతనూతలపాడు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి రెడీ అవుతోంది. అయితే, కనిగిరి, మార్కాపురం, ఒంగోలు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని మూడు పార్టీలు వేటికవే పట్టుపడుతున్నాయి. కాబట్టి ఏ పార్టీ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే విషయమై తొందరలోనే సమావేశం అవనున్నాయి. మొత్తం మీద వామపక్షాలతో సీట్ల సర్దుబాటు సమావేశాలు కూడా పెట్టేస్తుంటే ఇంకా చంద్రబాబునాయుడు మాత్రం పవన్ ను గోకుతునే ఉన్నారు. మరి పవన్ ఏం చేస్తారో ఏమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: