భారత దేశంలో ఇప్పటి వురకు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం..అనుకోని ప్రమాదాలు ఇలా ఏవైనా అన్యాయంగా అమాయకుడు బలి అవుతున్నారు.  వేల మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి..అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతున్నారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లో  లోని గుంటూరు జిల్లాలో ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాచర్లలోని కృష్ణవేణి ప్రైవేటు స్కూలుకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు బయలుదేరింది.

ఈ క్రమంలో వెల్దుర్తి మండలం మండాది వాగు వద్దకు రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.  దాంతో బస్సు ఒక్కసారే బోల్తా పడింది. ఆ బస్సలు 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.  ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే బయలు దేరిన అధికారులు బాధితులను మాచర్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇధ్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరులోని జీజీహెచ్ కు తీసుకెళ్లారు.  ప్రమాదం విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి పరామర్శించారు. కాగా, డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చిన్నారుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: