త్వరలో పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా పార్టీలు ప్రచారపర్వంలో దూసుకెళ్ళిపోతున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఒకపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పలుచోట్ల సభలు పెడుతూ దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రకటిస్తుంటే మరోపక్క ఎలాగైనా రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా ఉండాలని మమతా బెనర్జీ మరియు ఇతర నాయకులు కూటమిని ఏర్పాటు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.

Related image

ఇదిలా ఉండగా మే నెలలో జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పోలింగ్‌ బూత్‌ల పరిధిలో సిగరెట్‌ దుకాణాలను మూసివేయాలని కేంద్ర భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Related image

అయితే ఇప్పటివరకు ఎన్నికలు జరిగే పోలింగ్‌ రోజున మద్యం దుకాణాలను మాత్రమే నిషేధం ఉంది. పోలింగ్‌ జరిగే రోజు అన్ని చోట్ల మద్యం దుకాణాలు మూసివేస్తారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల సమయంలో పోలింగ్‌ జరిగే రోజున మద్యం దుకాణాలతో పాటు సిగరెట్‌ విక్రయ షాపులపై కూడా నిషేధం విధించారు.

Image result for election commission of india

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు డిసెంబర్‌ చివరి వారంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న చాలా రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యపోయారు .



మరింత సమాచారం తెలుసుకోండి: