ఆర్టీసీ సిబ్బంది వ్యవహరించిన నిర్లక్ష్యానికి రూ.3 వేల రూపాయలు పరిహారం చెల్లించుకుంది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో బంధువుల ఇంట జరుగుతున్న పెళ్లికి హాజరయ్యేందుకు నల్గొండకు చెందిన భార్యాభర్తలు కట్టెకోల నరసింహారావు, వాణిశ్రీ 2018 ఆగస్టు 26న ఇక్కడి బస్టాండ్‌లో సూపర్‌లగ్జరీ బస్సు (టీఎస్‌05జెడ్‌ 0188) ఎక్కారు.  బస్సు ప్రవేశద్వారం వద్ద బయటకు తేలిన రేకు తగిలి వాణిశ్రీ పట్టుచీర కొంచెం చిరిగింది.

అదే సమయంలో మరో మహిళ చీర కూడా అలాగే చిరిగిపోవడంతో..ఆ రేకును సరిచేయాలని డ్రైవర్‌కు నరసింహారావు దంపతులు చెప్పగా అది డిపో సిబ్బంది పని అని బదులిచ్చారు. దాంతో ఈ విషయాన్ని డిపో మేనేజర్ కి విన్నివించుకున్నా నిర్లక్ష్య దోరణి వహించారు. దాంతో బయటకు తేలిన ఇనుప రేకు, బస్సు ఫొటోలతో నల్గొండలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టిన ఫోరం ఆర్టీసీ బస్సులో లోపాలు నిజమేనని నిర్ధారించింది. పట్టుచీరకు రూ.2 వేలు, ఇతర ఖర్చులకు మరో రూ.1,000 జరిమానాను ఈ నెల 18న విధించింది. ప్రజలు టిక్కెట్ కొని ప్రయాణించే క్రమంలో వారికి ఎలాంటి అసౌకర్యం ఏర్పడిన బాధ్యత వహించాల్సి ఉంటుందని లేదని తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఈ ఘటనతో తెలిసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: