పొత్తు తెలుగు దేశం సెంటిమెంట్,  దానికి రాజకీయంగా అచ్చొచ్చిన అంశం. చంద్రబాబు రాజకీయాలకు పొత్తు ఆరవ ప్రాణం. టిడిపికి పొత్తులేందే పొద్దు పొడవదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నవేళ పార్టీల మధ్య చతుర్ముఖపోరు కనీసం, ఆపై పరిస్థితుల్ని బట్టి బహుముఖ పోరు తప్పదని తేలిపోతున్నా, అధికార టీడీపీ మాత్రం ఇంకా పొత్తుల కోసం తీవ్రంగా ఆరాట పడుతూ ఆశలు వీడేలా లేదు. 


ఇక్కడ బేసిక్ గా చంద్రబాబు స్వభావంలోని సుగుణం మరచి పోరాదు. ఉండవల్లి అరుణ కుమార్ చెప్పినట్లు చంద్రబాబు ఏదైనా అనుకుంటే సమరంలోనైనా సరే కడ వరకు పోరాడతాడు. అదే  ఇప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాన్ ను, ఆయన తో పొత్తును వదిలిపెట్టడు. అలాగే ఆయన కాంగ్రెస్ తో పొత్తు ఉండదని రాహుల్ గాంధి తో చెప్పించినా కూడా కాంగ్రెస్ తో పొత్తు లేదంటే నమ్మే పసిబాలుడు కూడా తాజాగా ఏపిలో ఉండడు. చడ్డీ కట్టుకునే ఏ బాలుడూ కూడా నమ్మడు. ఆ విధంగా చంద్రబాబు స్వభావం ఏపిలో ఎస్టాబ్లిష్ అయింది.

Image result for TDP Janasena alliance

జనసేన తో పొత్తు

Image result for TDP Janasena alliance

మారుతున్న కాలమాన పరిస్ధితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా జనసేన మద్దతు తమకు తప్పదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు అందుకు అనుగుణంగా జనసేనాని పవన్ కళ్యాన్ పై విమర్శలు చేయొద్దని టీడీపీ క్యాడర్ కు చాలా ముందుగనే ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు కూడా ఎక్కడా పవన్ కళ్యాన్ గురించి పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటివరకూ ఏ ఎన్నికల్లోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసిన ఘనచరిత్ర లేని టీడీపీని మరోసారి పొత్తుల దిశగా నడిపించేందుకు సీఎం చంద్రబాబు చేయని విశ్వ ప్రయత్నం లేదు.


ఇప్పటికే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తో పొత్తులు వికటించడంతో మిగిలిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ జనసేనతో నైనా కనీసం మరోసారి జత కట్టడం తప్పనిసరి అని చంద్రబాబు భావిస్తున్నారు. అప్పుడే వచ్చే ఎన్నికల్లో టిడిపి తాజా ఉన్న అపఖ్యాతి పలుచనై ఓటర్లకు పవన్ పై ఉన్న సానుకూల సంకేతాలతో కలసి టిడిపికి మేలు జరుగుతుందని చంద్ర బాబు అంచనా వేస్తున్నారు.


ముఖ్యంగా కీలక గోదావరి జిల్లాల్లో కాపు రిజర్వేషన్ల వలన పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత స్థాయి తీవ్రంగా మారిన్ది. దీన్ని అధిగమించాలంటే కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉండే ఈ రెండు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ అండ తోడు తీసుకోక తప్పని దిక్కుమాలిన పరిస్ధితి ఆయనది. ఎన్నికలలో గెలిచిన తరవాత పవన్ చేతికి గతంలో ఇచ్చినట్లు ఒక చిప్ప ఇస్తే సరి. ఆయన ప్రశ్నించి పీకేది ఏ మీ లేదు కదా! ఇదీ బాబు ఆలోచన.


అందుకే ఈసారి కుదిరితే ప్రత్యక్షంగా లేదా కనీసం పరోక్షంగా అయినా పవన్ తో పొత్తు కొనసాగించాలనేది చంద్రబాబు ఆలోచన  చివరి నిమిషంలో అయినా ఏదో రూపం లో జనసేన తమకు అండగా నిలబడుతుందని భావిస్తున్నచంద్రబాబు,  టీడీపీ క్యాడర్, నేతలను జనసేనపై విమర్శలు చేయకుండా చూస్తూ తాను కూడా విమర్శల కు దూరంగా ఉంటున్నారు. చివరికి తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన జయహో బీసీ సభ లోనూ పవన్ ను చంద్రబాబు పల్లెత్తుమాట అనకపోవడం దీనికి ఉదాహరణగా భావిస్తున్నారు.


రాజమండ్రి ఎంపీ, సిటీ ఎమ్మెల్యే స్ధానాల్లో జనసేన అభ్యర్ధులను రంగంలోకి దించడం ఈసారి ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు సీట్ల హామీతో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయ ణ జనసేన తీర్ధం కూడా పుచ్చుకున్నారు. ఇలాంటి కీలక స్ధానంలో జనసేనానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా చంద్రబాబు టీడీపీ నేతల్లో జోష్ నింపుతారని ఆశించినా సీఎం మాత్రం అలా చేయటానికి విముఖత చూపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తమ ఓటు బ్యాంకు చీలుస్తుందని బావిస్తున్న జనసేన విషయంలో సీఎం తీరు, ఆ పార్టీ నేతల్లో కూడా చర్చనీయాంశం అవుతోంది.


జనసేనతో పొత్తుపై తాను బహిరంగంగా స్పందించినా, పార్టీ నేతలతో లీకులు ఇప్పించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పవన్ కళ్యాన్  సైతం టీడీపీ నేతల వ్యాఖ్యలపై మండి పడుతుండటంతో, ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా ఎన్నికల ప్రకటన వచ్చాక అయినా, పవన్ ఏదో రకంగా తమకు మద్దతిస్తారని చంద్రబాబు ఆశిస్తున్నట్లు సమాచారం. అటు టీడీపీతో పొత్తు వద్దంటూ జనసేన క్యాడర్ నుంచి అంతర్గతంగా పెరుగుతున్న ఒత్తిడిని పవన్ కూడా నిశితంగా గమనిస్తున్నారు.

కాంగ్రెస్ తో మైత్రి & పొత్తు

Image result for TDP and Alliances

తెలంగాణలో మహాకూటమి అంటూ కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, తెజస పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీ ఆర్ధిక సహాయంతో ఎన్నికల నియంత్రణతో పోటీ చేసి, దారుణంగా విఫలం అయిన నేపద్యంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంలోకి వెళ్లారు. తెలంగాణలో ఓడిపోయినా, ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని కొంతకాలం ఆలోచించక పోలేదు. కాని ఎక్కడ తేడా కొట్టిందో లేక సర్వేలలో ఏమైనా వ్యతిరేకత వస్తుందని తేలిందో ఏమో? - చంద్రబాబు నాయుడు ప్లాన్-బి అమలుకు రంగంసిద్దం చేశారు.దానిని కాంగ్రెస్ ద్వారా ప్రకటింప చేశారు


ఎఐసిసి అధినేత రాహుల్ గాందీ ని డిల్లీలో ఈ మద్య చంద్రబాబు కలిసి అరగంట సేపు భేటీ అయి, ఆయనకు శాలువా కప్పి, ఇద్దరు పరస్పరం నవ్వులు చిందిస్తూ పోటోలకు పోజులు ఇచ్చి వచ్చిన మరుసటి రోజున కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం ప్రకటించిందంటే ఇందులో ఉన్న అంతరార్దం అర్ధం చేసుకోలేని వాళ్ళంకాదు మనం. అలాగే ఏపి ప్రజలు కూడా.ఎన్నికల విషయంలో చంద్రబాబు ఏమి చెబితే అది తు. చ. తప్పకుండా వినడానికి ఆచరించడానికి రాహుల్ గాంధీ సిద్దంగా ఉన్నారని తెలిసిన విషయమే. తెలంగాణలో పొత్తు పెట్టుకుని,పొరుగు తెలుగు రాష్ట్రం లో పొత్తు పెట్టుకోకపోతే జనం ఏమనుకోవాలి? తెలంగాణలో ఏర్పడిన విధంగా ఓటమి ఎదురు అవుతుందని భయ పడ్డారని భావించాలా? అయితే ఇక్కడే మెలిక ఉంది.


పైకి ఈ రెండుపార్టీల మద్య పొత్తు ఉండనట్లు చెప్పక పోయినా, మొత్తం కద అంతా టిడిపి అదినేత చంద్రబాబు నడిపే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గంలో ఎవరిని పెడితే తెలుగు దేశం పార్టీకి ప్రయోజనమో చంద్రబాబు నిర్ణయం చేయవచ్చు. అలాగే ఆయా చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఆర్దిక వనరులు సమకూర్చే బాద్యత కూడా చంద్రబాబు తీసుకోవాలి. ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలుస్తామని ప్రకటిస్తారు.

Image result for TDP and Alliances

ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారు? ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ ముందుకు వచ్చింది కనుక తాము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా సోనియాగాందీ ఆ విషయం ప్రకటించారు కదా! అని అప్పట్లో అన్నారు. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా అంశంపై టిడిపి అంత సీరియస్ గా లేదా? కాంగ్రెస్ తో పొత్తు లేదని చెప్పడం ద్వారా ఏమని చెప్ప దలిచారు.


మళ్లీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ను విబజించి కాంగ్రెస్ పొట్టకొట్టిందని చంద్రబాబు అనగలరా? అలాగే కొద్దినెలల క్రితమే ఎపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిపై చార్జీషీట్ వేసిన కాంగ్రెస్ పార్టీ వాటి గురించి మళ్లీ ప్రస్తా విస్తుందా? లేదా? లేక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ను తాటిబద్దతోను, టిడిపిని తమలపాకు తోనో కొట్టినట్లు విమర్శలు చేస్తారా? టిడిపితో పొత్తు లేదని ప్రకటించినప్పుడు చంద్రబాబుపై కాని, టిడిపిపై కాని కాంగ్రెస్ నేతలు ఊమెన్ చాందీ, రఘువీరారెడ్డి ఒక్క మాట అనకపోవడం గమనించదగ్గ విషయమే.


ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి.జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ ను ప్రస్తుతానికి పక్కనబెట్టారని కూడా అనుకోవచ్చా? టిడిపి ఎమ్.పి టిజి వెంకటేష్ టిడిపి,జనసేనలు పొత్తు పెట్టు కుంటాయని రహస్యం చెప్పేసి రెండు పార్టీలను కాస్త ఇరుకున పడేశారు.వెంటనే చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీక్ ఇస్తే, పవన్ కళ్యాణ్ పాడేరు సభలో ఈ విషయంపై టిజి వెంకటేష్ మీద విమర్శలు చేశారు.


అయితే పవన్ కళ్యాణ్ స్పష్టంగా టిడిపితో పొత్తు ఉండదని చెప్పినట్లు అనిపించలేదు. ఆ పార్టీ నేత దిలీప్ మాట్లాడుతూ రాజకీయాలలో ఏమైనా జరగవచ్చని, అయితే ప్రస్తుతానికి అయితే తాము వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నామని అనడం విశేసం.అంటే జనసేన క్యాడర్ లో కూడా దీనిపై అనుమానాలు ఉన్నాయన్నమాట. అలాగే చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ పై ఎవరూ విమర్శలు చేయవద్దని సూచన చేశారు.అంతేకాక టిజి వెంకటేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు పొత్తు ఉండదని చెప్పలేదు. ఇవన్ని అనుమానాలు కలిగిస్తాయి.

Image result for TDP and Alliances

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ లు కలిస్తే కుట్ర అని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అసలు కుట్రకు తెరదీసిందని అనుకోవాలి. అందుకే రాహుల్ గాందీకి శాలువా కప్పి వచ్చిన మరుసటి రోజు పొత్తు ఉండదని ప్రకటింప చేశారు. ఎక్కడైనా పొత్తు లేదని చెప్పుకోవడానికి శాలువాలు కప్పుకుంటారా? ఆనందం గా కౌగిలించుకుంటారా? ఎపిలో టిడిపికి వ్యతిరేకంగా సర్వేలు వస్తున్న నేపద్యం లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ను, రాహుల్ గాందీని తన చెప్పు చేతలలో పెట్టుకుని నడుపుతున్న కొత్త డ్రామా గా కాంగ్రెస్,టిడిపిల పొత్తు లేని వ్యవహరం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: