రాబోయే ఎన్నికల్లో పరిటాల సునీతకు షాక్ తప్పేట్లు లేదు. పోయిన ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సునీత గెలవగానే చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని అందరితోను సన్నిహిత సంబంధాలు నెరిపిన సునీత మంత్రవ్వగానే కేవలం కొందరి ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తున్నారంటూ ఆరోపణలు మొదలయ్యాయి. దానికితోడు నియోజకవర్గంలోని మండల స్ధాయి ప్రభుత్వ, పార్టీ పదవులన్నీ పరిటాల కుటుంబీల దగ్గరే ఉన్నాయి. అదే సమయలో కొడుకు పరిటాల శ్రీరామ్ ఆగడాలు కూడా ఎక్కువైపోయాయి.

 

ఇటువంటి నేపధ్యంలో పరిటాల రవి ఉన్నంత వరకూ పరిటాల కుటుంబానికి అండగా ఉన్న కీలకమైన వ్యక్తులు కూడా సునీతకు దూరమైపోయారు. దానికితోడు పరిటాల కుటుంబానికి బాగా సన్నిహితుడైన జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చమన్ హఠాత్తుగా మరణించారు. దాంతో వచ్చే ఎన్నికల్లో కమ్మేతర కులాలు ఎక్కువగా బిసిల్లో పరిటాల కుటుంబంపై వ్యతిరేకత పెరిగిపోయింది. బిసిల్లో కూడా వాల్మీకి ఉపకులంలో అయితే తల్లీ, కొడుకులపై ఒక విధంగా తిరుగుబాటే మొదలైంది. ఇటువంటి నేపధ్యంలోనే సునీత వ్యతిరేకులంతా రాప్తాడు నియోజకవర్గంలో కీలక సమావేశం పెట్టుకున్నారు.

 

పరిటాల ముఖ్య అనుచరుల్లో ఒకడైన వేపకుంట రాజన్న ఆధ్వర్యంలో వ్యతిరేక వర్గం సమావేశమైంది. చంద్రబాబు, సునీత పాలనలో పేదలకు తీరని అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. తల్లిమడుగుల గ్రామంలో జరిగిన సమావేశానికి టిడిపి జడ్పిటీసీ మాజీ సభ్యుడు మామిళ్ళపల్లి పెద్దప్పయ్య, వెంకటరామిరెడ్డి, గంగంపల్లి జేష్ఠరామయ్య తో పాటు  పెద్ద ఎత్తున బాధితులు హాజరయ్యారు. సునీత కారణంగా నియోజకవర్గంలోని బడుగు, బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని నేతలు మండిపడ్డారు. సునీత బాధలు పడలేకపోతున్న కారణంగా తొందరలోనే వాళ్ళంతా టిడిపిని వదిలేపి వైసిపిలో చేరాలని కూడా డిసైడ్ అయ్యారు. సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న విషయాలను చూస్తే వచ్చే ఎన్నికల్లో సునీత గెలుపు అంత ఈజీ కాదని అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: