జ‌న‌సేనాని ఏ వ్యాఖ్య‌లు చేసినా ఇప్పుడు ప్ర‌జ‌లు పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నా యి. స్వ‌యంకృత అప‌రాధ‌మ‌ని వీటికి పేరు పెట్టినా త‌ప్పులేదు. ప్రజ‌ల ప‌క్షాన తాను నిలుస్తాన‌ని వెళ్లి షూటింగుల్లో పాల్గొన్న ప‌వ‌న్‌పై ప్ర‌జ‌ల్లో ఏనాడో న‌మ్మ‌కం స‌న్న‌గిల్లింది. ప్ర‌త్యేక హోదా కోసం పోరు చేస్తాన‌ని, ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చిన‌ప్పుడు ఉన్న ఊపు త‌ర్వాత చూపించ‌లేక‌పోయేస‌రికి ఆనాడే ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పూర్తిగా పోయింది. ఇక‌, ఎప్ప‌టిక‌ప్పుడు మాట‌లు మార్చ‌డంపైనా ప్ర‌జ‌ల్లో ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఇమేజ్ కూడా పూర్తిగా దెబ్బ‌తింది. స‌రే! ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పైనా ప్ర‌జ‌లు వ్యంగ్యంగా చ‌ర్చించుకుంటున్నారు. 


తోట చంద్రశేఖర్ ఓడిపోయిన గుంటూరు నుంచే 2019లో గెలిపిస్తానని మాట ఇచ్చాను. నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయబోతున్నారు. మనోహర్ నాకు కొండంత అండ. గుంటూరు జిల్లాలో జనసేన బలం చూపిస్తాం. బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకోని అమరావతిని స్వాదీనం చేసుకుంటాం. అమరావతి గడ్డపై జనసేన జెండా ఎగురవేస్తాం. మీరు నాకు అండగా ఉన్న లేకున్నా, నేను మీకు జీవితాంతం అండగా ఉంటాను. నాది కులం రెల్లి కులం. అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తాను. డబ్బు, పదవి ఆశీంచుకుండా నేను రాజకీయాలు చేస్తున్నాను- అని ప‌వ‌న్ చెప్పుకొచ్చాడు. దీనిలో ఆలోచ‌న క‌న్నా.. ఆవేశం పాళ్లేఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. 


అంటే ఓట‌ర్ల‌ను పూర్తిగా ఆవేశానికి గురి చేసి త‌న‌వైపు తిప్పుకోవాల‌నే ప్ర‌య‌త్న‌మే త‌ప్ప .. క్షేత్ర‌స్థాయిలో ప‌వ‌న్ ప‌రిస్థితిని గ‌మ‌నించ‌లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గుంటూరులో ప‌వ‌న్ ప్ర‌క‌టించిన ఇద్ద‌రు నాయ‌కులు కూడా గ‌తంలో ఓడిపోయారు. స‌రే.. ఎప్పుడు ఓడిపోవాల‌ని లేదు కాబ‌ట్టి ఈ ఇద్ద‌ర‌ని ప‌వ‌న్ గెలిపించుకునే అవ‌కాశం ఉంది. దీనిని ప‌క్క‌న పెడితే.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లో అమ‌రావ‌తిని కైవ‌సం చేసుకుని, అక్క‌డ జ‌న‌సేన జెండా ఎగిరేలా చేస్తాన‌ని. ఇది సాధ్య‌మేనా? ప‌వ‌న్ అనేది నెటిజ‌న్ల మాట‌. గుంటూరు అంటేనే.. టీడీపీకి కంచుకోట‌గా మారింది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కారు.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూసుకుంటే.. గుర‌జాల‌, వినుకొండ‌, పెద‌కూర‌పాడు, పొన్నూరు, చిల‌క‌లూరిపేట‌, వేమూరు, రేప‌ల్లె, స‌త్తెన‌ప‌ల్లి వంటి కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ దురంధ‌రులు ఉన్నారు. 


వీరికి ఇక్క‌డ ఇవి కంచుకోట‌లు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన నాయ‌కులు. వీరినికాద‌నే ప్ర‌జ‌లు కూడా ఇక్క‌డ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ విష‌యంపై ఏమాత్రం అవ‌గాహ‌న ఉన్న నాయ‌కుడైనా.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ర‌నేది సోష‌ల్ మీడియా మాట‌. మ‌రి ప‌వ‌న్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేసే ముందు జిల్లాలో రాజ‌కీయ స్వ‌రూపాన్ని తెలుసుకుంటే మంచిద‌ని సూచిస్తున్నారు. మొత్తం 17 నియోజ‌క‌వర్గాలున్న గుంటూరులో గ‌త ఎన్నిక‌ల్లో 12 చోట్ల టీడీపీ సైకిల్ దూసుకుపోయింది. ఇప్పుడు ఆ సీట్లు ఖ‌చ్చితంగా టీడీపీ ఖాతాలోకే వ‌స్తాయ‌ని అన్ని స‌ర్వేలూ చెబుతున్నాయి. వీటికితోడు న‌ర‌స‌రావుపేట‌, మంగ‌ళ‌గిరి, మాచ‌ర్ల, బాప‌ట్ల‌ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఖాతాలోకే వ‌స్తాయ‌ని అంటున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఆశ‌లు ఎలా తీర‌తాయో ఆయ‌నే చెప్పాలి!! 



మరింత సమాచారం తెలుసుకోండి: