ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు జనారణ్యంలోకి రావడం..వాటిని చూసి జనాలు పరుగులు తీయడం చూస్తున్నాం.  కొన్ని కృర జంతువుల వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎం సెంటర్ లోకి వెళ్లగా అక్కడ చిరుత పులి పిల్ల ను చూసి గుండెలు అరచేతితో పట్టుకుని భయంతో పరుగులు తీశాడు. 

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లా తుంగ్ ప్రాంతంలో ఆదివారం జరిగిందీ ఘటన. అడవి నుంచి దారి తప్పిన చిరుత పిల్ల చలికి తట్టుకోలేక అక్కడే ఉన్న ఏటీఎం సెంటర్‌లోకి దూరింది. కాస్త వెచ్చగా ఉండడంతో అక్కడే సెటిలైపోయింది. ఈ విషయం తెలియని ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లడం..చిరుత పిల్లను చూసి కేకలు వేస్తూ పరుగులు తీయడం గమనించిన స్థానికులు ఏటిఎం వద్దకు వెళ్లి చూడగా చిరుత పిల్ల చూశారు. 

దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చివరికి ఓ టాక్సీ డ్రైవర్ సాహసం చేసి ఏటీఎం నుంచి దానిని బయటకు తీశాడు. అతడి చేతుల నుంచి తప్పించుకున్న అది అక్కడే ఉన్న ఓ వాహనం కిందికి వెళ్లి నక్కింది.  ఇక లాభం లేదని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వారొచ్చి దానిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: