ఎన్నికల ముందు చంద్ర బాబు ఎదో ఒక మ్యాజిక్ చేసే జనాలను తన వైపు తిప్పుకొనే సామర్ధ్యం కలవాడు. 2014 లో కూడా ఇదే జరిగింది . అయితే చంద్ర బాబు జై హో బీసీ లు అంటూ ఎన్నికల ముందు చేస్తున్న హడావిడి చూస్తూనే ఉన్నాము. దీనితో వైసీపీ అలెర్ట్ అయ్యింది. వైసీపీ కూడా బీసీల సంక్షేమానికి సంబంధించి ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది. అంతేకాదు - ఎన్నికలకు అతి దగ్గర సమయమైన ఫిబ్రవరి రెండో వారంలో బీసీ గర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది.

Image result for jagan and chandra babu

ఆ సభలో పార్టీ అధినేత జగన్ బీసీలకు లబ్ది చేకూర్చే ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. రాజకీయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఎన్నికల వేళ అది అత్యంత కీలకం. ప్రత్యర్థి పార్టీ ప్రకటించే హామీల కంటే మరింతగా ప్రకటించేందుకు పార్టీలు వ్యూహరచన చేస్తుంటాయి. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తోంది. చంద్రబాబు బీసీ సభలో ఇచ్చిన వరాల జల్లుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ హామీలన్నింటినీ పరిశీలించే పనిని పార్టీ పెద్దలకు అధినేత అప్పగించినట్లు తెలిసింది.

Image result for jagan and chandra babu

వాటి కంటే గొప్పగా.. బీసీలకు మేలు చేకూర్చే విధంగా.. బీసీ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై నివేదిక తయారుచేయాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం. పైగా.. బీసీలకు ద్రోహం చేసిన టీఆర్ ఎస్ తో కలిసొస్తున్నారన్న అపవాదును ధీటుగా తిప్పికొట్టేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న అంశంపై కూడా వైసీపీ అధినేత దృష్టి పెట్టారట. అంతేకాకుండా ఈ నాలుగున్నరేళ్ల పాలనలో టీడీపీ బీసీలకు చేసిందేమీ లేదని ఎన్నికలు సమీపిస్తుండటంతో కపట ప్రేమ చూపుతుందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: