వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార టీడీపీ, విపక్ష వైసీపీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఆ రెండు పార్టీలు సామాజిక సమీకరణలను కూడా బేరీజు వేసుకుంటూ ముందుకుసాగుతున్నాయి. రేపటి రోజున ఏపీలో అధికారానికి నిచ్చెన మెట్లు ఏ వర్గాలు అన్నవి కూడా లెక్కలు తీసి మరీ దగ్గర పెట్టుకున్నాయి. 


జగన్ బీసీ నినాదం :


నిన్నటి రోజున చంద్రబాబు జయహో బీసీ సభ సక్సెస్ అయింది. ఆ పార్టీ తనకు మొదటి నుంచి మద్దతుగా  ఉన్న బీసీలను మరో మారు దగ్గరకు తీసుకునేందుకు ఈ సభ పెట్టింది.  వరాలు జల్లు కూడా కురిపించింది. ఇపుడు వైసీపీ వంతు వచ్చింది. నిజానికి జగన్ పాదయాత్రలోనే బీసీల డిక్లరేషన్ అంటూ తీసుకువస్తామని, ఆ వర్గాల కోసం తాము చేయబోయే కార్యక్రమాలను ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది. దానికి ఇపుడు కార్యరూపం ఇస్తున్నారు. ఈ మేరకు బీసీ నేతలతో భేటీ అయిన జగన్ వైసీపీ బీసీల కోసం అమలు చేసే పధకాలు గురించి కసరత్తు చేస్తున్నారు.


ఏలూర్లో మీటింగ్ :


బీసీలతో పెద్ద ఎత్తున ఎలూరులో ఫిబ్రవరి 19న భారీ మీటింగుని నిర్వహించడం ద్వారా జగన్ ఆయా వర్గాలకు చేరువ కావాలనుకుంటున్నారు. బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదని చెప్పడంతో పాటు, నాటి వైఎస్ పాలనలో చేసిన పనులు, తాము అధికారంలోకి వస్తే చేయాల్సిన పనుల గురించి వివరించడమే బీసీ గర్జన సభ ముఖ్య‌ ఉద్దేశమని తెలుస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే రెండు పార్టీలు ఇపుడు బీసీల మీదనే ద్రుష్టి పెట్టాయి.
చాన్నాళ్ళుగా ఏపీ రాజకీయాల్లో బీసీల ధోరణిలో మార్పు కనిపిస్తోంది. వారు వన్ సైడెడ్ గా ఈసారి ఓట్లు వేయబోరని తేలుతోంది. దాంతో జగన్ సైతం బీసీలను దగ్గరకు తీయాలనుకుంటున్నారు. దానికి ఆయన ఇటీవల ప్రకటించిన కొన్ని అంశాలతో పాటు, కాపుల రిజర్వేషన్ల మీద క్లారిటీ, ఇతర అంశాలు కలసి జగన్ కి బీసీల నుంచి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని పార్టీ విశ్వాసంతో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: