ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో చంద్రబాబునాయుడు లగడపాటి రాజగోపాల్, మీడియా అధినేత రాధాకృష్ణతో రహస్య సమావేశం బయటపడింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత లగడపాటి, రాధాకృష్ణ చంద్రబాబు నివాసానికి వెళ్ళి సమావేశమయ్యారు.  వీరి ముగ్గురు భేటీ దాదాపు మూడు గంటలపాటు సాగిందని జగన్మోహన్ రెడ్డి మీడియా చెబుతోంది.  వీరిద్దరితోను చంద్రబాబు సమావేశం అవ్వటం చూస్తుంటే అభ్యర్ధుల ఎంపిక, రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం టిడిపి అనుసరించాల్సిన విధానాలను, డబ్బుల పంపిణీ తదితర అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగుంటుందని గుప్పుమంటోంది.

 

తెలంగాణా ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓటమి ధ్యేయంగా చంద్రబాబు, లగడపాటి, రాధాకృష్ణ పనిచేసిన తీరు అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఏపిలో కూడా మళ్ళీ ఓ బృందంగా సమన్వయంగా పనిచేయాల్సిన అవసరంపై చర్చ జరిగిందట. అయితే, తెలంగాణా ఎన్నికల్లో ముగ్గురు బోర్లా పడిన విషయాన్ని పక్కనపెడితే ఏపిలో అనుసరించాల్సిన విషయాలపై సుదీర్ఘ చర్చ జరిగిందట. ఎందుకంటే, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీది పై చేయి అనే విషయమై జాతీయ మీడియా చాలా సర్వేలే నిర్వహించాయి. ఏ ఒక్క సర్వేలో కూడా చంద్రబాబుకు అడ్వాంటేజ్ ఉంటుందని ఎవరూ చెప్పలేదు. ప్రతీ సర్వేలోనూ జగన్ దే మెజారిటీ సీట్లు అని సర్వేలు తేల్చి చెప్పాయి. దానికితోడు చంద్రబాబు చేయించుకుంటున్న సర్వేల్లో కూడా టిడిపికి ఓటమి తప్పదని తేలుతోందట.

 

ఇటువంటి నేపధ్యంలోనే జనాల మైండ్ సెట్ మార్చటం ఎలాగ అనే అంశంపై చర్చలు జరిగుంటాయని జగన్ మీడియా చెబుతోంది. నిజానికి వీరు ముగ్గరు రహస్యంగా అర్ధరాత్రి తర్వాత సమావేశం జరపాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు నైజమే అంత. ప్రతిదీ రహస్యంగానే ఉంచాలని అనుకుంటారు. దాంతోనే అందరికీ అనుమానాలు పెరిగిపోతుంటాయి. నాలుగున్నరేళ్ళ పాలనలో జనాల్లో చంద్రబాబంటే బాగా ఆగ్రహం ఉంది. అందుకనే మరోసారి ఆచరణ సాధ్యంకానీ హమీలనిస్తున్నారు. అయినా ప్రజలు టిడిపికి ఓట్లేస్తారనే నమ్మకం ఉన్నట్లు లేదు. అందుకనే క్షేత్రస్ధాయిలో వాస్తవాలను చర్చించుకునేందుకే వారితో చంద్రబాబు భేటీ అయ్యారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: