రాహుల్ గాంధీ 2019 లో తమ పార్టీ ని అధికారం లోకి రప్పిస్తే సార్వత్రిక కనీస ఆదాయం ను అమలు చేస్తామని ప్రకటించారు. నిజానికి ఇప్పుడున్న పేదరిక జనాభానికి భారత దేశం లో ఇటువంటి పథకం చాలా అవసరమని చెప్పాలి. దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చేబట్టిన పేదరికాన్ని రూపుమాప లేకపోయింది. ఎన్ని పధకాలు ప్రవేశ పెట్టిన అరకొర నిధులతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది. 

Image result for rahul gandhi

లక్షలాది మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పేదరికంతో మగ్గుతుంటే మనం కొత్త భారత్‌ను ఎలా సృష్టించగలమని, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎవరే పరిస్థితుల్లో ఉన్నా అందరికీ కనీస ఆదాయం అనేది ఉండాలని, ఈ సార్వత్రిక కనీస ఆదాయం గురించి 2016-17లోనే భారత ఆర్థిక సర్వే చెప్పిందని, ఒక్కో వ్యక్తికి రూ.7,620 కనీస వార్షికాదాయం కల్పించాలని చెప్పిందని, 2019లో తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయ భరోసా కల్పిస్తామని రాహుల్ గాంధీ సోమవారం పేర్కొన్నారు.

Image result for rahul gandhi

అయితే  రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ భరోసా పైన బీఎస్పీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మంగళ వారం స్పందించారు. పేదరిక నిర్మూలపై రాహుల్ హామీ అంతా అబద్దమని విమర్శించారు. నల్లధనం పైన ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ లాంటిదే రాహుల్ గాంధీ ఇచ్చిన ఈ హామీ అన్నారు. హామీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో అని నినాదం ఇచ్చిందని, కానీ అది నెరవేరలేదన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కూడా అటువంటిదేనని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ఆమె కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్క నాణేనిక ఉన్న రెండు ముఖాలు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: