గత కొంత కాలంగా నిశ్శబ్దంగా ఉన్న జార్ఖండ్ అడవుల్లో తుపాకులు ఘర్జించాయి.  జార్ఖండ్ రాష్ట్రంలోని సింగభూం జిల్లా పరిధిలోని అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరుగగా, ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతంలో మావోలు తిరుగుతున్నారన్న పక్కా సమాచారం అందగా, సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, కోబ్రా బెటాలియన్, రాష్ట్ర సాయుధ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. 

ఖాకీల రాకను పసిగట్టిన నక్సల్స్‌ కాల్పులకు దిగారు. పోలీసులు జరిపిన ఎదురుదాడిలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఐదుగురు మావోయిస్టులు మరణించారని, మరో మావోయిస్టు గాయాలతో తప్పించుకోగా, అతని కోసం వెతుకుతున్నామని వెల్లడించారు.
 encounter at Jharkhand forests
ఘటనా స్థలిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, ఒక 303 రైఫిల్, రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నామని, కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు.  గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా జార్ఖండ్‌ లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించే పనిలో పడ్డారు పోలీసులు.  



మరింత సమాచారం తెలుసుకోండి: