ఏ ఆయుధమైనా ఎవరికైనా ఒకసారే పనికివస్తుంది. అదే చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరులకు మరి కొన్ని సార్లు పనికివస్తుంది. అంతే తప్ప అన్ని సార్లు అందరికీ ఏదీ పని చేయదు. ఏపీలో ప్రస్తుతం ఉన్న వాతావరణం, ప్రత్యర్ధి వైసీపీ నుంచి వస్తున్న ఘాటైన విమర్శలు వంటివి చూస్తూంటే బాబుకు గత ఎన్నికల్లో పదునైన ఆయుధంగా  ఉపయోగపడినది ఇపుడు చెల్లకుండా పోతుందా అనిపిస్తోంది.


అనుభవమే మైనస్ :


2014 ఎన్నికలపుడు చంద్రబాబు ఆయన వెనక ఉన్న వారు, మద్దతుగా నిలిచే మీడియా సైతం అనుభవం ఆయనకు అపారంగా ఉంది. కొత్త రాష్ట్రానికి అది చాలా అవసరం అంటూ ఊదరగొట్టారు. ఆయన వస్తేనే రాజధాని నిర్మాణం, నీటి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని, ప్రగతి వేగంగా పరుగులు తీస్తుందని చెప్పుకొచ్చారు. వాటిని నమ్మి జగన్ మీద మోజు ఉన్నా తగ్గించుకుని మరీ ఓటు వేసిన విషయం వాస్తవం. అయితే అయిదేళ్ళ పాలనలో అనుభవం ఎంతవరకూ పనికి వచ్చిందన్నది జనానికి ఈ పాటికి బాగానే అర్ధమైపోయింది. అది ప్రత్యేక హోదా విషయం అయినా, పోలవరం ప్రాజెక్ట్ అయినా, అమరావతి రాజధాని అయినా పేదలకు సంక్షేమ పధకాలు ఆలొచించడం అయినా బాబు సొంత బుర్ర ఉపయోగించి చేసింది పెద్దగా లేదని కూడా అర్ధమైంది. దాంతో ఇపుడు బాబు అండ్ కో మళ్ళీ అనుభవం అంటూ జనాల ముందుకు వస్తే అది బూమరాంగే అవుతుందంటున్నారు.


అవుట్ డేటెడ్ :


బాబుని అవుట్ డేటెడ్ నేతగా వైసీనీ మహిళా నాయకురాలు రోజా అభివర్ణించారు. ఆయన ఆలోచనలు అభివ్రుధ్ధి వైపు ఉండవని, అసలు ఆయనకు అవి తట్టవని కూడా రోజా హాట్ కామెంట్స్ చేశారు. అందుకే జగన్ నవ రత్నాల పేరుతో ప్రకటించిన వాటిని మక్కెకి మక్కీ కాపీ చెస్తున్నారని కూడా ఆమె విమర్శించారు. దీన్ని బట్టి జగన్ ఆలొచనలు లేటెస్ట్ వని, అదే బాబు వి కాపీ అండ్ పేస్ట్ అన్నట్లుగా  ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆయన అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని రోజా ఘాటుగానే కామెంట్స్ చేశారు. కాలం తీరిన మందు లాంటి బాబు పాలనను మళ్ళీ తెచ్చుకుంటే ప్రమాదమేనని చెబుతున్నారు. 
అంటే బాబు అనుభవం అని ఊదరగొట్టినదంతా అవుట్ డేటెడ్ అంటూ వైసీపీ ఇపుడు ఎన్నికల్లో వాడేసుకుంటోందన్నమాట. 



అలా ఎవరూ చేయలేదు :


అంతటితో ఆగకుండా పసుపు కుంకుమ పధకం అంటూ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచిచిన సీఎం ప్రపంచలోనే బాబు తప్ప ఎవరూ లేరని కూడా అమె అన్నారు.         బాబు అనుభవం ఏంటో అయిదేళ్ళ పాలన చెబుతోందని అందువల్ల ఆయన్ని ఓడించాలని ఆమె పిలుపు ఇచ్చారు. నిజంగా బాబు టీడీపీ మాత్రం ఈసారి అనుభవం అన్న మాట ఎత్తలేవేమో, అదే విధంగా జగన్ అవినీతి కూడా వారు ఆయుధంగా చేసుకోలేరు. ఎందుచేతనంటే ఆ కేసులు  ఏవీ నిలబడడంలేదు, పైగా ఏపీ సర్కార్ మీదనే ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి ఏం చెప్పి ఈసారి నెగ్గుకురావాలన్నది బాబు టీం కి గట్టి సవాలే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: