ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రం పట్ల వ్యవహరించింది అన్న దాని గురించి మరియు విభజన హామీలు ఏ విధంగా రాష్ట్రానికి తీసుకురావాలి అన్నదానిపై రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ సమావేశానికి హాజరుకాని వైసీపీ పార్టీ గురించి సంచలన కామెంట్ చేశారు.

Related image

రాష్ట్రంలో ఉన్న చాలా పార్టీలు హాజరైన ఈ సమావేశానికి అధికార పార్టీ నుండి కూడా కొంతమంది ప్రభుత్వ నేతలు హాజరయ్యారు. దీనితో ఈ మీటింగ్ ముగిసే సమయంలో అసలు వైసీపీ పార్టీ నుంచి ఎవరు రాకపోవడం పై కారణం తేల్చేసారు.

Image result for undavalli arun kumar jagan

నిజానికి ముందు గానే తెలుగుదేశం పార్టీ నేతలు వస్తే తాము రామని వైసీపీ నుంచి జగన్ స్పష్టం చేసేసారు. దీంతో ఈ సమావేశానికి  వైఎస్ఆర్సిపి పార్టీ రాలేమని వారు తెలిపారని మరీ ముఖ్యంగా ఇప్పటికే రెండు పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు,

Image result for undavalli arun kumar pawan kalyan

ఈ సమయంలో వారంతా ఒకే వేదికపైకి రావడం వారికి అంతగా ఇష్టం లేదు అని వారు తెలిపారని ఉండవల్లి స్పష్టం చేసారు. మరోపక్క ఉండవల్లి సమావేశం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో కొన్ని మార్పులు తీసుకు వచ్చే అవకాశముందని కామెంట్లు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: