పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తూనే తన అన్న చిరంజేవి కి నాకు చాలా వ్యత్యాసము ఉందని ప్రతి సారి మాటల ద్వారా, చేతల ద్వారా చూపిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పదవుల కోసం , పొత్తుల కోసం పాకులాడని నైజాం జనాల్లో మంచి గుర్తింపు ను తీసుకొస్తుంది.  అయితే పవన్ చిరులా కాదు. అధికారం లేకపోయినా ఫర్వాలేదు.. 20ఏళ్ల సుదీర్ఘ ప్రణాళికతో వచ్చానని చెప్పుకుంటున్నారు. పదవులివ్వకపోయినా మీకోసం పనిచేస్తాను, ప్రశ్నిస్తాను అంటూ ప్రజల్లో భరోసా కల్పిస్తున్నారు.

Image result for pavan kalyan janasena

గత ఎన్నికల టైమ్ లోనే పదవులు వదులుకున్నానని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతానికైతే పవన్ మాటలు నమ్మేలానే ఉన్నాయి. కొత్తగా పార్టీ పెట్టిన వ్యక్తి తొలి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి అయిపోయేంత రాజకీయ శూన్యత మన రాష్ట్రంలో లేదు. ఇలాంటి టైమ్ లో పవన్ ఐడియాలజీనే కరెక్ట్. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేస్తే పవన్ కల్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయగలరు.

Image result for pavan kalyan janasena

అధికారం కోసం పాకులాడి పొత్తుల ఎత్తులకు చిత్తవకుండా సోలో రాజకీయాలు చేస్తేనే పవన్ ఏంటనేది ప్రజలకీ, రాజకీయ నాయకులకీ తెలుస్తుంది. అందుకే పవన్ 20ఏళ్లు టార్గెట్ పెట్టుకున్నారు, కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తానంటూ ముందుకొస్తున్నారు. ఈ దీర్ఘకాలిక లక్ష్యమే పవన్ కి మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఈలోగా పవన్ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకూడదు, చిరంజీవిలా అస్సలు వ్యవహరించకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: