టిడిపికి ధారుణమైన షాక్! కేంద్రంలో వైసిపి కింగ్ మేకర్ విజయం దాదాపు ఫుల్ స్వీప్ అని  - టైమ్స్ నౌ - వి ఎం ఆర్ సర్వే  చెపుతుంది.   రానున్న 2019 లోక్‌-సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో వైసిపి ప్రభంజనం కొనసాగనుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన సర్వే చెప్పేది కూడా చర్విత చర్వణమే. అన్నీ సర్వేల్లాగే మరో సర్వే వచ్చింది. వైఎస్ జగన్మోహనరెడ్ది నాయకత్వంలోని వైసిపి విజయం ఈ సర్వే ద్వారా కూడా క్లీన్ స్వీప్ అని చెప్పింది. 


ఆంధ్ర ప్రదేశ్‌ లో అధికారం ఎవరికి దక్క బోతుంది? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు దక్క బోతున్నాయి? ప్రతి తెలుగువాడి మదిలో చెలరేగే ఆసక్తికరమైన ప్రశ్న ఇది. అయితే అను మాన నివృత్తి కోసమే. శాసనసభ స్థానాలతో పాటు ఏ పార్టీకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు సొంతం చేసుకుంటుంది? అనే అంశం ఆసక్తికరంగా మారింది.  లోక్‌సభ స్థానాలకు సంబంధించి, టైమ్స్ నౌ-వీఎంఆర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌ లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం ఉంటుందని ఈ ఈ పోల్ అంచనా వేసింది. 


ఆంధ్రప్రదేశ్‌ లో 25 పార్లమెంటరీ స్థానాలకు గానూ, ప్రతిపక్ష వైసిపి 23 సీట్లను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ ఒపీనియన్ పోల్‌ లో వెల్లడైంది. అధికార టీడీపీ కేవలం రెండు స్థానాల కే పరిమితం అవుతుందని పేర్కొంది. అటు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది.


2014 లో టీడీపీ 15 స్థానాలను సొంతం చేసుకోగా, వైసిపి 8 స్థానాలను, బీజేపీ 2 సీట్లను గెలుచుకున్నాయి. 2019 లోక్‌-సభ ఎన్నికల తర్వాత వైసిపి కేంద్రంలో వ్యూహాత్మక స్థానంలో ఉండ గలదని ఈ ఒపీనియన్ పోల్ అభిప్రాయపడింది. 
Image result for Times now VMR latest survey on AP
ఇక ఓట్ల శాతం పరంగా చూసినా వైసిపీదే పైచేయిగా కనిపించింది. వైసిపి, టీడీపీల మధ్య ఓట్ల వత్యాసం కూడా భారీ గానే ఉంటుందని సర్వే పేర్కొంది. వైసిపికి 49.50 శాతం ఓట్లు, టీడీపీకి 36 శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది. 2014 లోక్‌-సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. అప్పుడు వైఎస్సార్‌సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. 


తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 16 లోక్-సభ స్థానాలు గెలుచుకోవాలని చూస్తుండగా, ఆ పార్టీకి 10 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ-వీఎంఆర్ ఒపీనియన్ పోల్‌ లో అభిప్రాయ పడింది. కాంగ్రెస్ 5, బీజేపీ 1, ఎం ఆఇ ఎం ఇతరులు ఒక స్థానం చొప్పున గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం టీఆర్ఎస్‌ కు 12 మంది ఎంపీలుండగా,  కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపీలున్నారు. 

ys jagan will be the king maker after 2019 lok sabha elections: times now-vmr opinion poll

మరింత సమాచారం తెలుసుకోండి: