2019 ఎన్నికలు దగ్గర పడుతుండటం తో జాతీయ ఛానెల్స్ దేశ వ్యాప్తంగా సర్వే లి నిర్వహిస్తున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభంజనం ఉండబోతుందని ఇప్పడూ మరో సర్వే చెప్పడం విశేషం. ఈ సర్వే ప్రకారం జగన్ పార్టీకి ఏపీలో 23 లోకసభ సీట్లు, అధికార తెలుగుదేశం పార్టీకి రెండు లోకసభ సీట్లు వస్తాయి. ఇటీవల పలు సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెబుతున్నాయి.

Image result for jagan

ఇటీవల పలు సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోకసభ సీట్లు ఎక్కువగా వస్తాయని చెబుతున్నాయి. గత రెండు మూడు నెలల సర్వేలను పరిశీలిస్తే వైసీపీకి 13 సీట్లు, 19 సీట్లు, 21 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. ఇప్పుడు ఏకంగా 25 లోకసభ సీట్లకు గాను 23 సీట్లు వస్తాయని చెప్పడం గమనార్హం. ఇది వైసీపీలో అత్యంత ఉత్సాహాన్ని నింపే విషయమే. ఎందుకంటే 25 లోకసభ స్థానాలకు గత 2014 ఎన్నికల్లో గెలుచుకున్న సీట్ల కంటే మూడు రెట్లు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి.

Image result for jagan

ఈ సర్వే ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.5 శాతం ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 36 శాతం ఓట్లు రానున్నాయి. ఏపీలో తెలుగుదేశం, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే టీడీపీకి నష్టమని, వైసీపీకి లాభమని పలు సర్వేలు వెల్లడించాయి. అదే సమయంలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే వైసీపీ సీట్లు 13కు, టీడీపీ - కాంగ్రెస్ సీట్లు 11కు పెరుగుతాయని వెల్లడించాయి. ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ పొత్తు తేలిపోయింది. ఆ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి ఇది ప్లస్ అయిందని, అందుకే 23 సీట్లు వస్తాయని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: