లగడపాటి రాజగోపాల్.. ఆంధ్రా ఆక్టోపస్ లా పేరున్న పెద్ద మనిషి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తమ పరువును పణంగా పెట్టేశాడు. సర్వేల విషయంలో తనకున్న విశ్వసనీయతను సైతం తెలంగాణ ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టేశాడు. చంద్రబాబు నాయకత్వంలోని మహాకూటమి ఓటమి ఖరారైందని తెలిసినా.. తన సర్వేల మాయతో జనాన్ని గందరగోళపరిచి చంద్రబాబుకు మేలు చేయాలని విఫలప్రయత్నం చేశాడు.

చివరకు జనం లగడపాటి, చంద్రబాబు అనుకున్నంత అమాయకులేమీ కాదని నిరూపించారు. వీరి నక్కజిత్తులకు కర్రు కాల్చి వాత పెట్టారు. తెలంగాణ జనం ఇచ్చిన షాకు నుంచి తేరుకునేందుకు పాపం లగడపాటికి ఇన్నాళ్లు పట్టిందేమో మరి. తీరిగ్గా చంద్రబాబుతో అర్థరాత్రి మంతనాలు జరిపిన తర్వాత కానీ.. లగడపాటి గారికి తదుపరి కర్తవ్యం ఏంటో బోధపడినట్టు లేదు.

Image result for lagadapati survey


అందుకే చంద్రబాబును కలిసి గీతోపదేశం చేయించుకున్న లగడపాటి.. తన మాయోపాయం రెండో అంకం ప్రారంభించేందుకు పెద్దగా సమయం తీసుకోలేదు. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్న రీతిలో మరోసారి జనాన్ని మాయ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు లగడపాటి రాజగోపాల్. ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి తన తెలంగాణ సర్వే వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా పాట్లు పడ్డారు.

సర్వేల విషయంలో అన్ని సార్లూ విజయం సాధించలేరు. ఈ విషయంలో లగడపాటి వైఫల్యం చెందారని ఎవరూ విమర్శించడంలేదు. మహా మహా జాతీయ స్థాయి సర్వే సంస్థలే ప్రజానాడి పట్టుకోవడంలో విఫలమవుతుంటారు. కానీ లగడపాటి విషయంలో జరిగింది అది కాదు కదా. ఆయన సర్వే చేయించాడు.. అందులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అని తేలింది.

Image result for lagadapati survey


కానీ అదే సర్వేను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ కూటమిని దెబ్బ తీసేందుకు ఆఖరి ప్రయత్నాలు చేశాడు. చంద్రబాబుతో కుమ్మక్కై.. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని విఫల ప్రయత్నం చేశాడు. అదే లగడపాటి చేసిన భ్రష్ట రాజకీయం. అందుకే ఎన్నడూ లేనిది ఆయన మొదటి సారి తెలంగాణ ఫలితాలపై ఓటింగ్ కు ముందే మాట్లాడారు. ఇండిపెండెంట్లు గెలవబోతున్నారంటూ ఫలితాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. కానీ లగడపాటి అండ్ కో పప్పులు ఉడకలేదు.

మళ్లీ ఇప్పుడు ఆంధ్రా ఎన్నికలపై ప్రభావం చూపేందుకు రెండో విడత రంగ ప్రవేశం చేశాడు లగడపాటి. అందుకు తగిన డైరెక్షన్ కోసం ఏపీ సీఎం చంద్రబాబుతో ఏబీఎన్‌ రాధాకృష్ణను వెంటబెట్టుకుని వెళ్లారు. అక్కడ వ్యూహాలు పన్నినట్టున్నారు. వాటి అమలు కోసం ఇప్పుడు మరోసారి బయలు దేరారు జగడాల లగడపాటి రాజగోపాల్.



కిందపడ్డా తనదే పైచేయి అని భావించే లగడపాటి.. ఇన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చి ఈసీ పనితీరుపై పాత అనుమానాలనే మరోసారి వల్లెవేశాడు. ఈవీఎంల్లో ఓటింగ్ జరిగినా ఓటింగ్ శాతం చెప్పడానికి ఒకటిన్నర రోజులు పట్టింది అంటూ ఈసీ తీరునే తప్పుబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఎందుకు ఆలస్యమైందో ఈ సీ స్థానిక అధికారులు వివరణ ఇచ్చారు కూడా. కానీ అవి వినేందుకు ఆంధ్రా ఆక్టోపస్ సిద్దంగా లేడు.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తీరుపైనా తనదైన శైలిలో విషం చిమ్మేందుకు లగడపాటి ప్రయత్నించాడు. తెలంగాణలో ప్రతిపక్షాలు బాగా పుంజుకున్నాయంటూ సూత్రీకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకారం కాంగ్రెస్‌ కు 10 శాతం కంటే ఎక్కువ పంచాయతీలు రాకూడదని.. కానీ ఇప్పుడు మూడోవంతు వస్తున్నాయి అంటూ విచిత్ర వాదన వినిపించడం ప్రారంభించారు.



పంచాయతీ తొలి రెండు విడతల్లో కాంగ్రెస్‌ జోరు కొనసాగింది. మూడో విడతలో కాస్త హస్తం తేరుకున్నట్టు కనిపించింది. ఇప్పుడు దీన్ని లగడపాటి తన రాజకీయ పాచికల కోసం వాడుకుంటున్నాడు. తొలి రెండు విడతల్లో వచ్చిన లెక్కలు పక్కకు పెట్టి మూడోవిడతనే ప్రాతిపదికగా తీసుకుని కొత్త వాదాలు తెరపైకి తెస్తున్నాడు. సో.. లగడపాటి రాజకీయం అంతా చంద్రబాబుకు మేలు చేసేందుకే.. మరోసారి ఏపీలోనూ సర్వేల మాయ చేసి చంద్రబాబును ఒడ్డున పడేసేందుకు ప్రయత్నించడమే. కాకపోతే.. లగడపాటికి తెలంగాణలో వచ్చిన ఫలితాలే రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజలు ఈ నక్కజిత్తుల నాయకులందరి కంటే తెలివైనవారన్నదే అసలైన సత్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: