ఇల్లు అలకగానే పండుగ కాదు, అలాగే పరీక్షకు సిధ్ధపడగానే పాస్ అయినట్లు కూడా కాదు, ఏపీలో చూసుకుంటే వైసీపీకి ఇప్పటికిపుడు ఎన్నికల్లో ఏకంగా 23 ఎంపీ సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇది ఆనందించతగిన విషయమే. కానీ వైసీపీ క్యాంపులో మాత్రం మరో రకమైన టెన్షన్ పట్టుకుందట. 


గట్టి వారేరీ :


ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లకు 23 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయని టైమ్స్  నౌ కుండబద్దలు కొట్టింది. బాగానే ఉంది. కానీ పోటీ చేసేందుకు క్యాండిడేట్లు ఉన్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న. వైసీపీలో అంతా అసెంబ్లీకే జై కొడుతున్నారంట. చిత్రమేంటంటే ప్రత్యే హోదా కోసం రాజీనామాలు చేసిన అయిదుగురు ఎంపీల్లో కూడా మార్పు చేర్పులు ఉన్నాయంటున్నారు. మరి మొత్తనికి  మొత్తంగా పాతిక సీట్లకు అంగబలం, అర్ధబలంతో పాటు ప్రజాదరణ ఉన్న అభ్యర్ధులు వైసీపీకి దొరుకుతారా అన్నదే ఇక్కడ ప్రశ్న.


ఉత్తరాంధ్రాలో అలా :


ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే అయిదు ఎంపీ సీట్లు ఇక్కడ ఉన్నాయి. ఇందులో పోయిన ఎన్నికల్లో వైసీపీ అరకు సీటును మాత్రమే గెలుచుకుంది. మిగిలిన వాట్లో బొక్క బోర్లా  పడింది. అప్పట్లో విశాఖ నుంచి విజయమ్మ, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్, విజయన‌గరం నుంచి బేబీ నాయన, శ్రీకాకుళం నుంచి రెడ్డి శాంతి, అరకు నుంచి కొత్తపల్లి గీత పోటీ చేశారు. వీరిలో గీత ఒక్కరే గెలిచి పార్టీ గీత దాటేసి టీడీపీలో చేరిపోయారు. ఇక విజయమ్మ ఈసారి  పోటీ చేయరు. అనకాపల్లి అసెంబ్లీ నుంచి అమర్నాధ్ పోటీ చేస్తున్నారు. విజయనగరంలో బేబీ నాయన సోదరులు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. శ్రీకాకుళంలో రెడ్డి శాంతి కూడా అసెంబ్లీ అంటున్నారు.


మిగిలిన చోట్లా అంతే :


ఉత్తరాంధ్రనే కాదు. గోదావరి జిల్లాలోనూ గట్టి అభ్యర్హ్దులు ఎంపీ సీటుకు వైసీపీకి ఉన్నారా అంటే డౌటేనని వినిపిస్తోంది కాకినాడ సీటుతో పాటు, అమలాపురం, ఏలూరు వంటి వాటికి గెలిచే గుర్రాల కోసం వేట సాగుతోంది. గుంటూరు, నరసారావుపేట ఒకే అనుకున్నా విజ‌యవాడకు క్యాండిడేట్లు  లేరు. మచిలీపట్నం కూడా వెతకాలి. అలాగే చిత్తూరు సీటుకి, రాజంపెట ఎంపీ స్థానానికి కూడా అభర్ధులు వైసీపీకి కావాలి. మరి అన్ని చోట్ల సమర్ధులకు. జనాల నోళ్ళలో నానే వారికి టికెట్లు ఇస్తేనే సర్వేలు చెప్పినట్లుగా ఫలితాలు వస్తాయి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. వైసీపీతో పోల్చుకుంటే అన్ని చోట్లా దాదాపుగా టీడీపీకి గట్టి క్యాండిడేట్లు ఉన్నారు. మరి ఈ పరిస్థితిని వైసీపీ ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: