ఒక పార్టీ బతకాలంటే దానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలి. కానీ పవన్ కల్యాణ్ జనసేన ఏర్పాటై ఐదేళ్లు దాటుతున్నా ఇంతవరకూ ఒక్క ఎన్నికలోనూ పాల్గొన్నది లేదు. ఒక్క వార్డు కూడా గెలిచింది లేదు. అందుకే పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు.



సొంతంగా పోటీ చేస్తే అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోతే పార్టీ మనగుడ ఎలా అన్నది ఆయన్ను వేధిస్తున్న ప్రశ్న. అందుకే ఆయన ఇటీవల మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ ఎత్తుగడలు చూస్తుంటే.. తెలంగాణలోని తెలంగాణ జనసమితి గుర్తుకువస్తోంది.



తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌గా ప్రజల అభిమానం చూరగొన్న కోదండరామ్ కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలన్నకారణంతో తెలంగాణ ఎన్నికల్లో పొత్తులకు వెళ్లారు. కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేకపోయారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది.

Image result for kodandaram


తెలంగాణలో కోదండరామ్ చేసిన తప్పే ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా చేస్తున్నారా అనిపిస్తోంది. ఇన్నాళ్లూ పార్టీని ఏమాత్రం పట్టించుకోని పవన్ కల్యాణ్.. సరిగ్గా ఎన్నికల ముందు ఫుల్ టైమర్ గా వచ్చి ఎన్నికల్లో సీట్ల కోసం కక్కుర్తిపడి అసలుకే ఎసరు తెచ్చుకుంటారా.. మరో ప్రజారాజ్యంగా మారతారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: