ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచాక ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేపట్టిన కేసీఆర్ తనతో పాటుగా హోం మంత్రిగా మహమ్మద్ ఆలీని నియమించి ప్రమాణ స్వీకారం గవర్నర్ సమక్షంలో చేశారు. అయితే టిఆర్ఎస్ పార్టీ రెండోసారి గెలిచి తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలలు కావస్తున్నా కానీ మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ప్రతిపక్ష పార్టీల నుండి అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మంత్రివర్గ విస్తరపై టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టిసారించారని తెలుస్తోంది.

Image result for kcr

ఫిబ్రవరి మూడోవారంలో అసెంబ్లీలో ఓటన్‌ బడ్జెట్‌ సమావేశం ప్రారంభించే సమయానికి మినీ మంత్రివర్గాన్ని లేదా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఫిబ్రవరి 8వ తేదీన మంత్రి వర్గం ఏర్పాటు ఉండవచ్చునని విశ్వసనీయంగా తెలుస్తోంది.మినీ కేబినెట్‌ అయితే మరో ఆరు మందిని తీసుకోవచ్చునని, ఇప్పటికే సిఎంగా కెసిఆర్‌,హోమ్‌మంత్రిగా మహ్మద్‌ అలీ ఉండటంతో వారితో కలిపి మొత్తం 8 మందితో కేబినెట్‌ ఏర్పడవచ్చు.

Related image

లేదా కొత్తగా మరో 8మందిని తీసుకొని,మొత్తం 10మందితో కూడిన మినీ కేబినెట్‌ ఏర్పడవచ్చు. కొత్తగా మరో 8 మందితో కూడిన కేబినెట్‌ ఏర్పడితే,అందులో ముగ్గురు కొత్తవారు,ఐదుగురు పాతవారు ఉండేలా అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Image result for kcr

కొత్తవారిలో ఒక మహిళ తప్పనసరిగా ఉండే అవకాశం ఉందని, మిగతా ఇద్దరు మొదటిసారి గెలిచిన వారు లేదా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలు(సండ్ర వెంకట వీరయ్య తదితరులు) ఉండవచ్చునని తెలుస్తోంది. మొత్తంమీద కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై అడుగులు వేయడంతో టిఆర్ఎస్ పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: