200 మంది తెలుగు విద్యార్ధులను అమెరికా పోలీసులు అరెస్టు చేయటం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. అమెరికాలో వేలాదిమంది విదేశీయులు అక్రమంగా సంవత్సరాల తరబడి నివాసముంటున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే అమెరికాను వలసవాదుల దేశమని కూడా అంటారు.  అక్రమంగా నివామంటున్న వేలాదిమంది విదేశీయుల్లో భారత విద్యార్ధులు కూడా ఉన్నారు. వలసదారులతో వస్తున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రభుత్వం అందరినీ పట్టుకోవాలని నిర్ణయించింది.

 

అయితే, తాము అక్రమంగా అమెరికాలో ఉంటున్నామని ఎవరూ బయటకు వచ్చి చెప్పుకోరు కదా ?  ఇదిలావుండగానే యూరివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ లో ఉన్నత చదువుల కోసం అడ్మిషన్లు మొదలయ్యాయి. ఒకసారి ఏదైనా యూనివర్సిటీలో చేరితో దాన్ని అక్రమ వలస అనేందుకు లేదు. ఎందుకంటే, అమెరికా యూనివర్సిటీనే అడ్మిషన్ ఇచ్చిన తర్వాత అది అక్రమంగా ఉంటున్నట్లు కాదు. ఉన్నత చదువు కోసమే అమెరిలో ఉంటున్నట్లు స్వయంగా యూనివర్సిటీనే ధృవీకరించినట్లవుతుంది.

 

ఎప్పుడైతే యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చిందో అక్రమవలసలు అనే ముద్ర చెరుపుకునేందుకు వివిధ దేశాలకు చెందిన వందలాది మంది విద్యార్ధులు వెంటనే దరఖాస్తులు చేసుకున్నారు. అలా దరఖాస్తు చేసుకున్న వారందరికీ యూనివర్సిటీ కూడా అడ్మిషన్లు ఇచ్చేసింది. ఇంకేముంది యూనివర్సిటీలో చేరిపోయాం కాబట్టి అమెరికా ప్రభుత్వం తమను ఇంకేమీ చేయలేందని అందరూ అనుకున్నారు. అలా అడ్మిషన్లు పొందిన వారిలో భారతీయులు అందులోను తెలుగు విద్యార్ధులు కూడా ఉన్నారు లేండి.

 

అయితే, ఒకరోజు హఠాత్తుగా హోం ల్యాండ్ సెక్యురిటీ పోలీసు అధికారులు యూనివర్సిటీ మీద దాడులు చేశారు. ఎవరైతే అడ్మిషన్లు పొందారు వారందరినీ సెక్యురిటీ అధికారులు అరెస్టులు చేశారు. అందులో తెలుగు విద్యార్ధులు 200 మంది ఉన్నారు. తాము యూనివర్సిటీలో చదువుకునేందుకు  అడ్మిషన్లు పొందిన తర్వాత కూడా అరెస్టులు చేయటమేంటని విద్యార్ధులు ఎదురుతిరిగారు. అయితే, సెక్యురిటీ అధికారులు చెప్పిన సమాధానంతో అందరికీ కళ్ళు బైర్లు కమ్మాయి.

 

అమెరికాలో అక్రమవలసదారులను పట్టుకోవటం నిజంగా కష్టమే. అందుకనే అమెరికా ప్రభుత్వం ఓ పథకం పన్నింది. దాని ప్రకారం హోం ల్యాండ్ సెక్యురిటీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. క్షేత్రస్ధాయిలో లేని ఫర్మింగ్టన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అడ్మిషన్లకు నోటీసులిచ్చారు. అమెరికాలో ఉండేందుకు ఏదో ఒక అవకాశం దొరికింది కదా అని అక్రమంగా ఉంటున్న వారు వెంటనే దరఖాస్తు చేసుకుని అడ్మిషన్లు కూడా తీసేసుకున్నారు. అడ్మిషన్ల సమయంలో ఎటూ తమ అడ్రస్ లు ఇస్తారు కదా. దాని ప్రకారమే పోలీసులు అడ్రసుల్లో వెతికి మరీ అక్రమంగా ఉంటున్న వారిని పట్టుకున్నారు.

 

యూనివర్సిటీ, అడ్మిషన్లు అంతా తమను పట్టుకోవటానికే అని తెలుసుకున్న విదేశీయులు ఇపుడు లబోదిబోమంటున్నారు. అంటే యూనివర్సిటీ ఉత్తదే. అందులో అడ్మిషన్లూ ఉత్తదే. కలుగులో నుండి ఎలుకలను రప్పించటం కోసం ఎలా పొగ పెడతారో అలాటే పోలీసులు కూడా ఓ యూనివర్సిటీని సృష్టించి అక్రమంగా ఉంటున్న వారిని పట్టుకున్నారన్నమాట. సరే దేశంకాని దేశంలో పట్టుబడితే ఎవరికైనా ఇబ్బందే. అందుకనే అరెస్టయిన తెలుగువాళ్ళ కోసం ఉత్తర అమెరికా తెలుసు సంఘం (నాట్స్) రంగంలోకి దింగిందనుకోండి అది వేరే సంగతి. అరెస్టయిన వాళ్ళ భవిష్యత్తేమిటో తొందరలోనే తెలిసిపోతుంది లేండి


మరింత సమాచారం తెలుసుకోండి: