టైమ్స్ నౌ ఛానల్ ప్రకటించిన సర్వే ఫలితాల్లో వైస్సార్సీపీ పార్టీ కి 23 స్థానాలు . టీడీపీ కి కేవలం 2 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పడం ఇప్పడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వైస్సార్సీపీ కి 23 స్థానాలంటే అసెంబ్లీ స్థానాలు సుమారు 140 వరకు రావొచ్చు. అయితే ఈ సర్వే ఫలితాలు టీడీపీ మీద చాలా వ్యతిరేకత ను వ్యక్తం చేస్తున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జాతీయ స్థాయిలో  బీజేపీకి సొంతంగా 215, కాంగ్రెస్ కు సొంతంగా 96 ఎంపీ సీట్లు దక్కుతాయని టైమ్స్ నౌ పేర్కొంది.

Image result for chandrababu naidu

ఇక ఇతరల పార్టీలకు 144 ఎంపీ సీట్లు దక్కుతాయని ఈ సర్వే పేర్కొంది. ఈ నంబర్లు దాదాపుగా రిపబ్లిక్, ఇండియాటుడేలు ఇచ్చినవే. ఇక ఏపీకి సంబంధించి రిపబ్లిక్ టీవీ తరహా అంచనాలనే వ్యక్తంచేసింది టైమ్స్ నౌ కూడా. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 19 ఎంపీ సీట్లను నెగ్గుతుందని, ఆరు సీట్లలో తెలుగుదేశం పార్టీ నెగ్గుతుందని రిపబ్లిక్ టీవీ అంచనాలు వేసింది. అయితే టైమ్స్ నౌ వైసీపీపై మరిన్ని భారీ అంచనాలను ఏర్పరిచింది.

Image result for jagan

వైసీపీ ఏకంగా 23 ఎంపీ సీట్లను నెగ్గుతుందని టైమ్స్ నౌ అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీ కేవలం రెండంటే రెండు ఎంపీ సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేయడం గమనార్హం. రిపబ్లిక్ టీవీ అంచనాలతో పోలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లను కట్టబెడుతోంది టైమ్స్ నౌ సర్వే. ఇక ఈ సర్వే కూడా జనసేనకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మొత్తానికి ఆ సర్వేలను చేస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం అత్యంత తీవ్రమైన ప్రజా వ్యతిరేకతనే ఎదుర్కొంటున్నట్టుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: