రాజ‌ధాని జిల్లా గుంటూరులో టీడీపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి నాయ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చే అంశం పూర్తిగా తెర‌మీదికి రాకుండానే ఇక్క‌డ టికెట్ల కోసం పోటీ ప‌డుతున్న నాయ‌కుల సంఖ్య భారీ ఎత్తున పెరిగింది. మాకంటే మాకేన‌ని టికెట్ల కోసం సీనియ‌ర్లు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ముఖ్యంగా న‌ర‌స‌రావు పేట  ఎంపీ టికెట్‌కి అధికార పార్టీలో మ‌రింత పోటీ పెరిగింది. ఈ టికెట్ ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కుడు, మాజీ కాంగ్రెస్ నేత రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ నుంచి ఆయ‌న త‌ప్పుకుంటార‌ని అంద‌రూ భావించారు. వాస్త‌వానికి స‌తీవియోగ భారంతో ఉన్న ఆయ‌న పోటీకి ఉండ‌ర‌ని అనుకున్నారు. 

Image result for రాయ‌పాటి సాంబ‌శివ‌రావు

తొలుత ఇదే విష‌యంపై క్లారిటీ ఇచ్చిన రాయ‌పాటి.. ఇప్పుడు వ్యూహాత్మ‌కంగా తానుకూడా బ‌రిలో ఉన్నాన‌ని చెబుతున్నా రు. ఇదే స‌మయంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కూడా ఇక్క‌డ నుంచి తాను కానీ, త‌న త‌న‌యుడు కానీ పోటీ చేయా ల ని భావిస్తున్నారు. అయితే, ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా దిగుతారా? అనే విష‌యంపై క్లారిటీ ఇవ్వ‌లేదు. న‌ర స‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు అన్ని స్థానాల్లోనూ టీడీపీ బ‌లంగా ఉంది. ఒక్క మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం త‌ప్ప మిగి లిన నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ విజ‌యం సాధించి దూసుకుపోతోంది. దీంతో న‌ర‌స‌రావుపేట‌లో ప్ర‌తిప‌క్షం గెలిచే ఛాన్స్ చాలా త‌క్కువ. దీనిని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ నేత‌లు ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని క్యూక‌డుతున్నారు. 

Image result for కోడెల శివ‌ప్ర‌సాద‌రావు

ఇప్పుడు తాజాగా మ‌రో నేత త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా టీడీపీలో ఉంటూనే అస‌మ్మ‌తి నేత‌గా గుర్తింపు పొందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి.. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌స‌రావు పేట నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని భావిస్తున్నాన‌ని, త‌న‌ను గౌర‌వించే పార్టీలోనే తాను ఉంటాన‌ని చెప్పుకొచ్చారు. గ‌తంలో తాను ఇక్క‌డ నుంచి గెలుపొందాన‌ని, అప్ప‌ట్లో విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంటులో త‌న్నులు కూడా తిన్నాన‌ని చెప్పిన‌ట్టు చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో త‌న‌కు ఎమ్మెల్యేగా ఇష్టం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఈ ప‌రిణామాల‌తో ఒక్క‌సారిగా న‌ర‌స‌రావు పేట రాజ‌కీయాల్లో టీడీపీ అభ్య‌ర్థుల సంఖ్య పెరిగిపోయింది. మ‌రి ఈప‌రిణామాల‌ను చంద్ర‌బాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి. 

Image result for మోదుగుల వేణుగోపాల రెడ్డి


మరింత సమాచారం తెలుసుకోండి: