Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 9:31 pm IST

Menu &Sections

Search

నేషనల్ సర్వేల్లో జగన్ కే పట్టం..! అవి పెయిడ్ సర్వేలా..?

నేషనల్ సర్వేల్లో జగన్ కే పట్టం..! అవి పెయిడ్ సర్వేలా..?
నేషనల్ సర్వేల్లో జగన్ కే పట్టం..! అవి పెయిడ్ సర్వేలా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వారం రోజుల్లో రెండు జాతీయ ఛానళ్లు సర్వేలు నిర్వహించాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో చెప్పడమే ఆ చానళ్ల ఉద్దేశం. జాతీయస్థాయిలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోయినా ఏపీలో మాత్రం అధికారం జగన్ దేనని ఆ సర్వేలు కుండబద్దలు కొట్టాయి. దీంతో వైసీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోతున్నాయి.

ysrcp-sweeps-ap-ycp-get-power-in-ap-jagan-reddy-sw

          రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ చానళ్లు ఈ వారంలో సర్వేల ఫలితాలను ప్రకటించాయి. ఈ రెండు సర్వేల్లో జాతీయ స్థాయిలో మోదీదే మళ్లీ అధికారమని తేల్చాయి. అయితే గతంలో లాగా ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ మాత్రం రాదని తేల్చాయి. మ్యాజిక్ ఫిగర్ కు కాస్త దూరంలో ఆగిపోవడం ఖాయమని, కచ్చితంగా ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వస్తుందని వెల్లడించాయి. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి అధికారం కల్లేనని స్పష్టం చేశాయి. కానీ గతంతో పోల్చితే ఆ పార్టీకి భారీగా లబ్ది చేకూరుతుందని వెల్లడించాయి.

ysrcp-sweeps-ap-ycp-get-power-in-ap-jagan-reddy-sw

          జాతీయస్థాయి అంశాలను పక్కనపెడితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైసీపీకి అధికారం దక్కబోతోందని రెండు సర్వేలూ తేల్చి చెప్పాయి. రిపబ్లిక్ టీవీ – సీఓటర్ సర్వేలో వైసీపీకి 21 స్థానాలు, టీడీపీకి 4 స్థానాలు దక్కుతాయని తేలింది. వైసీపీకి 42శాతం, టీడీపీకి 31 శాతం ఓట్లు లభిస్తాయని వెల్లడించింది. బీజేపీకి 12 శాతం, కాంగ్రెస్ కు 7 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక టైమ్స్ నౌ చానల్ సర్వేలో కూడా దాదాపు ఇదే ఫలితాలు వచ్చాయి. వైసీపీకి 23 స్థానాలు, టీడీపీకి 2 స్థానాలు వస్తాయని ఆ ఛానల్ వెల్లడించింది. రెండు జాతీయ ఛానళ్లు వారం రోజుల వ్యవధిలో తమకే అధికారం దక్కబోతోందని చెప్పడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ysrcp-sweeps-ap-ycp-get-power-in-ap-jagan-reddy-sw

          అయితే వైసీపీకి అనుకూలంగా ఆ రెండు ఛానళ్లు సర్వే ఫలితాలు వెల్లడించడాన్ని అధికార టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. వైసీపీ అనుకూల ఈ సర్వేల వెనుక మోదీ ఉన్నారని ఆరోపిస్తోంది. ఆ రెండు ఛానళ్లు బీజేపీ నేతల ఆధీనంలో నడుస్తున్నవేనన్న విషయం మర్చిపోవద్దని గుర్తు చేస్తోంది. గత ఎన్నికల సమయంలో కూడా వైసీపీకి అనుకూలంగానే చాలా చానళ్ల సర్వేలు వచ్చాయని, అయితే ప్రజాభిప్రాయం మాత్రం భిన్నంగా వచ్చిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ సర్వేలతో తాము భయపడాల్సిన పని లేదని, తాము ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ ముందుకెళ్తున్నామనేది టీడీపీ చెప్తున్న మాట. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అవే ఈసారి తమను మళ్లీ అధికారంలో కూర్చోబెడతాయనే దీమా తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఈసారి ఎలాగైనా చంద్రబాబును గద్దె దించాలనే లక్ష్యంతో మోదీ, కేసీఆర్ లు జగన్ ను పావుగా వాడుకుంటూ ఇలాంటి కుయుక్తులు చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది. ఇలాంటి పెయిడ్ సర్వేలు ప్రజాభిప్రాయం మార్చలేవని దీమాగా ఉంది.


ysrcp-sweeps-ap-ycp-get-power-in-ap-jagan-reddy-sw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీలోకి జయప్రద...! కండువా మారిస్తే కలిసొస్తుందా..?
కాంగ్రెస్ లోకి డ్యాన్స్ గాళ్..! నేను చేరలేదు నమ్మండి ప్లీజ్..!!
రాహుల్ తో ‘రె..ఢీ’ అంటున్న స్మృతి..! ఎందుకంత ధీమా..?
వాళ్లు పోటీ చేయట్లేదుగా... సో మేం గెలవడం ఖాయం..!! శివసేన వింత వాదన
పాక్ తో మళ్లీ శాంతి చర్చలు చేయ్యాల్సిందే! :కాంగ్రెస్
సెన్సేషన్ : చనిపోయేందుకు మాకు పర్మిషన్ ఇవ్వండి – 200 మంది గ్రూప్ 2 ఉద్యోగుల వినతి
కీలక నేతలు లేకుండానే ఎన్నికలు జరగొచ్చు..జగన్ వ్యాఖ్యల మర్మమేంటీ?
ఏది నిజం : అద్వానీని మోదీ-షా తప్పించారా..? ఆయనే తప్పుకున్నారా?
దిమ్మ తిరిగిపోయే డెసిషన్ తీసుకున్న మాయావతి!
కేరళలో బీజేపీకి కలిసొస్తున్న అంశమేంటో తెలుసా..?
అజహర్ తో ‘ఆట’ ఆడుకుంటున్న కాంగ్రెస్..!! జంపింగ్ ఖాయమా..?
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.