ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇటు అధికార పార్టీ, అటు ప్రతి పక్ష పార్టీ లు ఎత్తులు పై ఎత్తులు తో బిజీ గా ఉన్నారు. అయితే ఇక‌, ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేసి..నెల రోజుల పాటు పూర్తిగా ప్ర‌చారం లో ఉంటానంటూ ఎ న్నిక‌ల కార్యాచ‌ర‌ణ సీయం ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పార్టీ ఎమ్మెల్యేల‌తో సమావేశ‌మ‌య్యారు. ఎన్నిక‌ల అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. వ చ్చే ఎన్నిక‌ల్లో ఎలా ముందుకెళ్లాలో సూచించారు. ఎత్తుగ‌డ‌ల్లో జ‌గ‌న్ నిష్ణాతుడని వ్యాఖ్యానించిన సీయం.. ప్ర‌భుత్వ సాధించిన విజ‌యాల‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆదేశించారు.

Image result for chandrababu naidu

ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల లేక‌పోతున్నారంటు ఎమ్మెల్యేల‌కు క్లాస్ తీసుకున్నారు. మ‌నం కియో తెచ్చిన విష‌యాన్ని ఉత్త‌రాంధ్ర‌..రాయ‌ల‌సీమ నేత‌లు విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌న్నారు. రాజ‌శేఖ‌ర రెడ్డి ఒక్క ప‌రిశ్ర‌మ కూడా తేలేద‌ని.. ప్ర‌ధాని కియో తెచ్చారని బిజెపి నేత‌లు అబ‌ద్దాలు చెబుతున్నార‌న్నారు. ఎన్నిక‌ల ముందు మోదీ ఏం చెప్పినా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని పేర్కొన్నారు. రేపు ఢిల్లీకి వెళ్తున్నాన‌ని చెప్పిన సీయం..11న ఢిల్లీలో దీక్ష‌కు అంద‌రూ రావాల‌ని ఆదేశించారు. ఇందు కోసం ప్ర‌త్యేకం గా రైలు ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. 

Image result for chandrababu naidu

ఏపికి జ‌రిగిన అన్యాయం పై ప్ర‌జా సంఘాలు పోరాడుతున్నాయ‌ని..వారితో మ‌మేకం కావాల‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. ఫిబ్ర‌వ‌రి ఒక‌టిన బంద్ కు పిలుపునిచ్చార‌ని..మ‌నం బంద్ కు వ్య‌తిరేక‌మ‌ని చెప్పుకొచ్చారు. కేంద్రం చేసిన ద్రోహానికి నిర‌స‌న‌గా స‌భ‌లో తీర్మానం చేద్దామ‌ని..అంద‌రూ న‌ల్ల‌చొక్కాలు ధ‌రించి స‌భ‌కు రావాల‌ని ఆదేశించారు.  ఫిబ్ర‌వ‌రి 2,3,4 తేదీల్లో ఫించ‌న్ల పండుగ పేద‌ల పండుగగా జ‌ర‌పాల‌ని సూచించారు. ఆ మూడు రోజులు సంక్షేమ ఉత్స‌వాలు నిర్వ‌హిం చాల‌న్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: