చంద్రబాబు నాయుడు గారిని చూసి గతంలో ఆయననను గౌరవించిన వాళ్లే నేడు నోరెళ్ళ బెడుతున్నారు. ఏమైంది సారుకి?  అమరావతిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


అందులో ఒకటి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల్లో తన జూనియర్ అని, అయినా ప్రధాని మోదీ అహాన్ని సంతృప్తి పరచడానికి తాను సార్! అని సంభోదించే వాడినని వ్యాఖ్యానించారు. తాను అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ ను కలిసిన సందర్భంలో కూడా ఆయనను మిస్టర్! క్లింటన్ అని మాత్రమే సంబోధించానని, సార్! అని పిలవలేదని చెప్పారు. కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయనను ఇప్పటిదాకా దాదాపు 10 సార్లు సార్! అని పిలిచానని చంద్రబాబు తన ఆవేదన వెలిబుచ్చారు. అసలు అన్ని సార్లు ఇన్ని సార్లు అని కౌంట్ చెయ్యటంతోనే మీరు నిజంగా ఆయనకు గౌరవం ఇవ్వట్లేదని తేలిపోతుంది. 


కేవలం ఏపి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే, నరేంద్ర మోదీ అహం సంతృప్తి చెందేలా సార్!  అని పిలిచానని చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం. 2014లో రాష్ట్రానికి న్యాయం చేస్తుందనే ఉద్దేశం తోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, పొత్తు పెట్టుకోకుండా ఉంటే 10 సీట్లు ఎక్కువే గెలిచే వాళ్లమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్-టాపిక్‌ గా మారాయి.
Image result for is it insult to chandrababu to call Modi sir!
మీరు అనుభవఙ్జులని ప్రజలు ఓటేశారు బిజేపితో పొత్తు ప్రజల సమస్య కాదు. ముఖ్యమంత్రిగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అన్నది ప్రధానం. సార్! అని పిలిచారా? లేదా అన్నది కాదు. మీరు అనేక అనవసరమైన మాటలతో ద్వని కాలుష్యాన్ని జానాన్ని తికమకపెట్టినా జనం మాత్రం వినీవినీ తమ నిర్ణయమేమిటో స్థిరపరచుకున్నారని సమస్త సర్వేలు తెలుపుతూనే ఉన్నాయి. మీకు రానున్న ఎన్నికల్లో వైఫల్యం మీ ఇంటిలిజెన్స్ నివేదికల ద్వారానో ఇతర మార్గాల ద్వారానో తెలిసినట్లుందని  మీలోని తత్తరపాటు, మీ ధైహిక భాష తెలుపకనే తెలుపుతున్నాయి. 
 Image result for is it insult to chandrababu to call Modi sir!
నరేంద్ర మోడీ మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ మీకు ఒకటేనా! మీకేమో గాని — మాకు మాత్రం క్లింటన్ కంటే మోడీనే గొప్ప - మా ప్రధాని కాబట్టి. మిస్టర్ అనటం గౌరవ ప్రధమే. అది గౌరవ వాచకమే. యుఎస్ లో ఏవరు ఎవర్నైనా మిస్టెర్ లేదా మహిళైతే మిస్స్/మిసెస్ అనటం వారి సాంప్రదాయం. అక్కడ మీరు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ కు ఇచ్చిన ఎక్కువ  గౌరవమూ లేదు. తక్కువ చేసిందీ లేదు. 
Image result for is it insult to chandrababu to call Modi sir!
అయిన ఒక విదేశీ అధ్యక్షుడు ఎప్పటికి భారత ప్రధాని కంటే ఎక్కువకాదు. సార్వభౌమ దేశాధినేతలు ఇరువురు సమానులే. కాని భారతీయులకు భారత ప్రధానే ఎక్కువ అనేది మరవ కూడని విషయం. మీ మాటలను బట్టి మీరు అమెరికా కంటే భారతీయులకు భారత దేశమే భారత ప్రధానే అత్యంత గౌరవనీయులు. అది మరచిన రోజున ప్రజానాయకుడుగా మీకు అంత్యకాలం దాపురించినట్లే. మోడీ జగన్ పవన్ మిమ్మల్ని ఫుట్-బాల్ ఆడేస్తారు. మీ తలలో పేలేరటానికి కేసీఆర్ ఉండనే ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త!  
Image result for is it insult to chandrababu to call Modi sir!
ప్రస్తుత విషయానికి వస్తే ముందుగా నరెంద్ర మోడీ ఈ దేశానికి (మీతో కలిపి ప్రజలందరికి) ప్రధాన మంత్రి. అలాంటి వ్యక్తులను అధికారికంగా సార్! అని అంటున్నాము. అది అనూచానంగా బ్రిటీష్ వాళ్ళు ఈ దేశం వదలి వెళ్ళినా ఆ పిలుపును గౌరవ వాచకంగా మనకే వదిలేసి వెళ్ళారు. మన కంటే పెద్ద పదవిలో ఉన్న వారిని దేశం ప్రధానిగా ఎవరున్నా ఆఖరికి మీ కంటే అతి చిన్నవారు, ఆఖరుకు లోకేష్ బాబు ప్రధాని ఐనా ఆయన్ని మీరు కూడా సార్!  అనవలసిందే. అది తప్పు కూడా కాదు. మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మీ కున్న చనువును బట్టి పిలుపులో మార్పు రావచ్చు. మీరెంత సీనియర్ అయినా మీ కెంత అనుభవమున్నా వృత్తి పరంగా మీ కంటే ఉన్నత స్థానంలో ఉన్నవారిని సార్! అని సంభోదించటం అవమానం కాదు సరి కదా! రాష్ట్ర ప్రజల కోసం చేసిన త్యాగం కూడా కాదు. 
Image result for is it insult to chandrababu to call Modi sir!
రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా మీ అత్మాభిమానాన్ని కోల్పోయి తమకు సేవ చెయ్యమనలేదే! మీకు అవమానమనిపిస్తే సార్! అనకండి. ప్రధాని తనను దేశ ప్రజలంతా (మీతో కలిపి) సార్! అనమని చెప్పారా! దానికేమైనా సర్కులర్ ఆదేశం ఉందా? ఉంటే న్యాయస్థానంలో సవాల్ చేయండి. 


వృత్తిలో సీనియారిటీ జూనియారిటీ ఏమీ ఉండవు. ఎవరు సంపూర్ణ సామర్ధ్యంతో ప్రజలకు సేవ చేస్తున్నారనేదే ముఖ్యం. చిన్న చిన్న చిల్లికి తూటుకు పసి పిల్లాళ్ళా ప్రధానిపై పిర్యాదులు చేయటం రాష్ట్ర రాజకీయ అధికార ప్రతినిధై ఉండి పనికి మాలిన దీక్షలు చేస్తూ గత సంవత్సరకాలం పాలనను గాలికి వదిలేశారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణా ముఖ్యమంత్రితో తల బొప్పి కట్టించుకొని లక్షల కోట్ల విలువైన రాజధాని ప్రయోజనాన్ని గాలికి వది లేసి వేలకోట్ల ప్రజాధనాన్ని ఖర్చుబెట్టి తాత్కాలికమంటూ అన్ని భవనాలను, ఏర్పాట్లను తాత్కాలికం చేసేశారు. 
Related image
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ  అసమర్ధత అహంభావాన్ని రేపు నరేంద్ర మోడీ నిట్ట నిలువునా బాజారు కీడిస్తే ఏం చేస్తారు? ప్రతిపక్ష ఎంఎల్యే లను, ఎంపీలను కోనేసి ప్రతిపక్షాన్ని శాసనసభలో మననీయని మీ అప్రజాస్వామిక విధానం, మీ అమానవీయ స్వభావం క్షంతవ్యం కాదు. జగన్  అవినీతి పరుడైతే ఆయన అంతు చూడటానికి న్యాయస్థానాలు ఉన్నాయన్నది మరువరాదు. ఆ కేసులు న్యాయ స్థానంలో నడుస్తునే ఉండగా మీరిలా దూషించటం ధర్మ న్యాయ చట్ట విరుద్ధంకాదా! 
Image result for BJP Opposition led by CBN
అయినా ప్రజలు ఆయన్ని అద్భుతమైన ఆధిఖ్యతతో గెలిపించి ప్రతిపక్షనేతగా ఆయనకు సముచితమైన స్థానం అదే కాబినెట్ మంత్రి స్థాయి గౌరవం ఇచ్చారు. అవి మీరు. ప్రసాధించిన వరం  కాదు కదా! ప్రధాని నుంచి గాని ప్రజల నుంచి గాని మీరెలా గౌరవం ఆశిస్తారో మీరు మీ సహచరులకు అదే అందించాలి.  మీ సభాపతి చట్ట విరుద్ధంగా 23 మంది ఎంఎల్యేల రాజీనామా లు ఆమోదించకుండా నిశ్శబ్ధంగా కూర్చోవటం ధర్మ విరుద్ధం కాదా! ఒకవేళ చట్టం చెప్పకపోతే న్యాయం చేసే అవకాశం ఉన్నప్పుడు న్యాయం చేయరా? 
Image result for BJP Opposition led by CBN
మీ కంటే పై స్థానంలో ఉన్నవారిని గౌరవిస్తేనే రాష్ట్రానికి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రధాని నుంచి క్రేంద్రం నుంచి మీరు మీ అసంధర్భ ప్రలాపాలతో మాటలతో తెచ్చుకొనే కొరివి ఏపి ప్రజలకు న్యాయం జరగనివ్వటం లేదు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఇంటర్ పర్సనల్ రిలేషన్ షిప్స్ బాటలు వేస్తాయి కాని ఇలా అందరితో పెట్టుకొని నానా రభస చేసి, ఇప్పటికే ఇంటర్ పర్సనల్ రిలేషన్ షిప్స్ దిగజార్చిన మీరు జాతి నిర్మాణాన్ని రోజు రోజుకు కూల్చేస్తున్నారు. జాతి  పరువు గంగలో కలసిపోతుంది. మీరిలా మట్లాడుతుంటే మీ ఓటమి మీకే ఖారరైందని జనం భావిస్తారు 

మరింత సమాచారం తెలుసుకోండి: