వైఎస్ జగన్ తనను తాను టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ తో పోల్చుకున్నారు. అదేంటి జగన్ పోల్చుకుంటే వైఎస్సార్ తో పోల్చుకోవాలి కానీ ప్రత్యర్థి పార్టీ వ్యవస్థాపకుడితో పోల్చుకోవడమేంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు తమాషా..

Image result for ys jagan and senior ntr


తన పథకాలను కాపీ కొడుతున్న చంద్రబాబు విమర్శలు గుప్పిస్తూ వైఎస్ జగన్ ఎన్టీఆర్ తో పోల్చుకున్నారు. జగన్ తనతో భేటీ అయిన తటస్తులతో మాట్లాడుతూ.. పెన్షన్లే కాదు, ఇతర అంశాల్లోనూ చంద్రబాబు ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం కదా అంటూ చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు.

Related image


గతంలో ఎన్టీఆర్‌గారు రూ.2లకు కిలోబియ్యం ఇస్తానంటే.. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి గారు రూ.1.90 పైసలకు ఎన్నికలకు 6 నెలల ముందు ప్రకటించారని జగన్ గుర్తు చేశారు. అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసినట్టుగానే చంద్రబాబు కూడా చేస్తున్నారని విమర్శించారు. కానీ అప్పట్లో జనం ఎన్టీఆర్‌కే పట్టం కట్టిన విషయం మరచిపోకూడదని జగన్ గుర్తు చేస్తున్నారు.

Image result for kotla vijaya bhaskara reddy


ఇప్పుడు అర్థం అయ్యింది కదా.. చంద్రబాబును కోట్ల విజయభాస్కర్ రెడ్డితో పోల్చిన జగన్.. తనను మాత్రం ఎన్టీఆర్ తో పోల్చుకున్నాడన్నమాట. అంతే కాదు. చంద్రబాబును పరీక్షలు కాపీ కొట్టే స్టూడెంట్‌ తో పోల్చి పరువు తీసేశాడు. ఒక పిల్లాడు కష్టపడి పదోతరగతి పరీక్షరాస్తాడు.. పక్కనే ఉన్న ఇంకో పిల్లాడు అస్సలు చదవడు, మోసాలు చేసి కాపీకొడతాడు.. ఇప్పుడు చంద్రబాబు కూడా అంతేనంటూ వ్యాఖ్యానించారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: