ఆంధ్రాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయారు. ఆయన అతివిశ్వాసం వల్లే ఎన్నికల్లో ఓడిపోయారని చాలామంది విశ్లేషకులు అంచనా వేశారు. రుణమాఫీ హామీ ఒక్కటి జగన్ కూడా ఇచ్చి ఉంటే.. అధికారం దక్కి ఉండేదని జగన్ కూడా చెబుతుంటారు.



కానీ మరోసారి అలాంటి మిస్టేక్ కాకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారు. ఏపీలో అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ రెండు పార్టీలకు చెందకుండా ఉండే తటస్థ ఓటర్లను ప్రభావితం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. వారితో తరచూ సమావేశం కావాలని నిర్ణయించారు.



ఇందులో భాగంగా మొదటిసారి జగన్ హైదరాబాద్ లోన తన నివాసంలో తటస్తులతో భేటీ ఏర్పాటు చేశారు. వారితో మాట్లాడి వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. జగన్ అవలంభిస్తున్న ఈ కొత్త స్ట్రేటజీ బాగానే వర్క్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ భేటీల కారణంగా జగన్ పై ఉన్న ముక్కోపి, ఇగోయిస్ట్ అను ముద్ర క్రమంగా చెరిగిపోయే అవకాశం ఉంది.



తటస్తులు, మేథావులతో భేటీలో వారివారి ప్రాంతాల్లో, వారు చేస్తున్న విభాగాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు జగన్. అనేక అంశాలపై జగన్ విపులంగా వారితో మాట్లాడారు. రాష్ట్రానికి మంచి చేసేదిశగా మీ సహకారాన్ని ఆశిస్తున్నానంటూ వారి అభిమానం చూరగొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: