జేసి దివాకర్ రెడ్డి టీడీపీలో ఒక విలక్షణ వ్యక్తిత్వం కలవాడని చెప్పొచ్చు. తన స్వంత పార్టీ నేతల మీదే విమర్శలు కురిపిస్తాడు. పార్టీ అధినేత చంద్ర బాబు ను సైతం వదిలి పెట్టడు .  అయినా ఇప్పుడు చంద్రబాబును జేసీ ఎలా బుక్ చేశారన్న విషయానికి వస్తే... ఢిల్లీలో చంద్రబాబు చేయనున్న దీక్ష వల్ల ఒరిగేదేమీ లేదని ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసునని అయితే ఏదో చేయాలి కదా అన్నట్లుగానే బాబు ఢిల్లీ దీక్ష జరగనుందని జేసీ వ్యాఖ్యానించారు.

Image result for jc diwakar reddy

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఢిల్లీలో ప్రత్యక్షమైన జేసీ తనదైన స్టైల్లో మీడియా ముందు చెలరేగిపోయారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరు సాగిస్తున్న పార్టీ టీడీపీ ఒక్కటేనని చంద్రబాబు చెబుతూ ఉంటే... ఇప్పుడు హోదా కోసం ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేసినా ఒరిగేదేమీ లేదని జేసీ వ్యాఖ్యానించి నిజంగానే సంచలనం రేపారు. అయినా ఈ విషయంపై జేసీ వ్యాఖ్యలు ఎలా సాగాయంటే... *ఢిల్లీలో బాబు దీక్షతో ఎలాంటి ఉపయోగం లేదు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ఈ దీక్షతో ఫలితం ఉండదని చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ ప్రయత్నం వదిలి పెట్టకూడదని అలా చేస్తున్నారు.


యుద్ధం జరుగుతుందని శ్రీకృష్ణుడికి తెలుసునని అయినను హస్తినకు పోయి రావలెనని అన్నారు కదా. ఇది కూడా అంతే. ఢిల్లీలో దీక్షతో ఎలాంటి లాభం లేదని చంద్రబాబుకు తెలిసినా... ఏదో దీక్ష చేయాలంటే చేస్తున్నామన్నట్లుగా చేస్తున్నారంతే* అని జేసీ వ్యాఖ్యానించారు. అసలే ఎన్నికలు ఆపై ప్రభుత్వ వ్యతిరేకతతో ఎక్కడ కిందపడతామో అన్న కోణంలో చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే... జేసీ ఈ తరహా వ్యాఖ్యలు చేసి.. అసలు హోదాపై తామేమీ సీరియస్గా లేమన్నట్లుగా చెబితే ఎలా? అన్న వాదన వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: