వైసీపీ అధినేత జగన్ ఓ విషయాన్ని చెబుతున్నారు. పరీక్షలో కష్టపడి చదివేవారికే మార్కులు కానీ కాపీ కొట్టేవారికి పడవని. అయితే పరీక్షల్లో  కాపీలు కొట్టే వారు చాలా మంది దర్జాగా ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. ఎవరు అసలు ఎవరు నకిలీ అన్నది ఎలా తెలుస్తుంది. ప్రశ్నకు జవాబు ఇచ్చారా లేదా అన్నదే కదా ప్రధానం.


బాబు దూకుడు :


జగన్ నవరత్నాలు అంటూ ఏడాదిన్నర  క్రితం ప్రకటించినపుడు టీడీపీ మొత్తం అపహాస్యం చేసింది. ముఖ్యంగా ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడు అవి ఒట్టి గులకరాళ్ళు అన్నారు. అంతటితోఅ ఆగకుండా వాటిని తాము ఏనాడో అమలు చేశామని కూడా చెప్పుకున్నారు. మరి కొత్త ఏడాది వస్తూనే అవే నవరత్నాలు టీడీపీకి ముద్దు అయ్యాయి. బాబు ఒక్కోటీ బయటకు తీసి యమ జోరుగా వాడేస్తున్నారు. సామాజిక పించన్లు రెట్టిపు, రైతులకు వరాలు, బీసీలకు కులానికో కార్పోరేషన్ వంటివి బాబు అమలు చేసి చూపిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు కూడా అయన భూరి విరాళాలు ఇచ్చేశారు. మరి వైసీపీ సంగతేంటి..


కొత్త హామీలేనా :


ఎన్నికల వేళ జగన్ చేతిలో అస్త్రాలు లేకుండా చేసి అంతా తానే చేశానని చెప్పుకోవడానికి బాబు తాపత్రయపడుతున్నారు. జనాలు సైతం జగన్ చెప్పాడా మరొకరు అన్నారా అని చూడడంలేదు. బాబు ఇచ్చారు మాకు అనే తీసుకుంటున్నారు. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుందో పక్కన పెడితే జగన్ ఇవే హామీలతో రేపటి ఎన్నికల్లోకి వెళ్తే మాత్రం ఇబ్బందులేనని అంటున్నారు. జగన్ ఎన్నికల ప్రణాళికను  రెండేళ్ళు ముందు ప్రకటించి తప్పు చేశారా అన్న చర్చ కూడా ఇపుడు సాగుతోంది. 
మొత్తానికి జగన్ నవరత్నాలు కాపీ అని ఎంతగా చెబుతున్నా ఇవి  ఇపుడు బాబు పధకాలుగానే జనంలోకి పోతున్నాయి. కాబట్టి జగన్ మరిన్ని కొత్త హామీలతో జనాల్లోకి రావాలసిన అవసరం అయితే ఉంది. అదే నవరత్నాలు పట్టుకుని మాత్రం వస్తే బాబుకే అడ్వాంటేజ్ అని కూడా అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో..


మరింత సమాచారం తెలుసుకోండి: