ఎన్నికల్లో గెలుపునకు ఎన్నో అవసరం అవుతాయి. జనాదరణ అన్నది కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది కానీ అదే కొలమానం కాదేమో. దానికి ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందు కనిపిస్తాయి. రాజకీయాలు అనేవి చాలా పెద్ద సబ్జెక్ట్. ముఖ్యంగా సైకాలజీ మీద ఆధారపడి ఉన్న అంశం. సమాజాన్ని పూర్తిగా స్టడీ చేసిన వారికే విజయాలు దక్కుతాయి.


బాబు అంటే అదే :


ఏపీలో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇపుడున్న రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు. యువకులుగా జగన్, పవన్ రంగంలో ఉన్నారు. బాబు రాజకీయ జీవితం నాలుగు దశాబ్దాలపై దాటింది. బాబు 70 దశకం రాజకీయాల నుంచి వచ్చిన వారు. నిజానికి ఆ కాలం  వారిని  ఇపుడు అవుట్ డేటెడ్ అంటారు. కానీ అందుకు చంద్రబాబు మినహాయింపు. ఆయన వయసు  రిత్యా పెద్ద వారు అయి ఉండవచ్చు కానీ ఆలోచనలు మాత్రం ఎపుడూ కొత్తగానే ఉంటాయి.
ఆయన జనం  నాడిని పసిగట్టినంతగా ఇప్పటి తరం కూడా కనిపెట్టలేదు. ఎప్పటికి ఏది అవసరమో తెలుసుకుని ముందుకు దూకుడుగా అడుగులు వేయడమే కాదు. ప్రతీ దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో బాబు దిట్ట. అందుకే ఆయన రాజకీయం మీద ఇటు జనాలకు, అటు పార్టీ వారికీ కూడా అంత నమ్మకం.


ట్రబుల్ షూటర్ :


బాబు మాములు సమయాల్లొనే చాలా ఎక్కువగా అలోచిస్తారు. అదే ఏదైనా సమస్య వచ్చి మీదపడితే ఆయన పాదరసం కంటే వేగంగా స్పందిస్తారు. ఆ విధంగా ఆయన ఆలోచనలు సాగుతాయి. విద్యార్ధి జీవితం నుంచి కూడా బాబు ఆ విధమైన తీరుతోనే ముందుకుసాగారు. చంద్రబాబును అందుకే ట్రబుల్  షూటర్ అంటారు. ఆయన మాటల్లోనే చెప్పినట్లుగా సంక్షోభాలను ఆయన సవాళ్ళుగా తీసుకుని అధిగమించిన ఘట్టాలెన్నో ఆయన జీవితంలో కనిపిస్తాయి. బాబు ఓ విషయం మీద చూపు సారించాలే కానీ అపజయం ఉండదని కూడా అందుకే నమ్ముతారు.


చాణక్య  రాజకీయం :


ఏపీలో ఈ మాటలకు  బాబు పెట్టింది పేరు. ఆయన చాణక్య రాజకీయం ముందు ఎవరూ నిలువలేరు. దేశంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ బాబును వదిలించుకున్నపుడు ఇంత దారుణంగా తమ పరిస్థితి ఏపీలో ఉంటుందని ఊహించలేకపోయింది. అదే పనిగా ఓ పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తూ ఏపీ ప్రజల ద్రుష్టిలో బీజేపీని బాబు పెద్ద విలన్ని చేశారు. ఆ ప్రభావం జాతీయ స్థాయిలోనూ పాకేలా చేయగలిగారు. బాబు తో పెట్టుకుంటే ఇంతే  సంగతులు అని గట్టిగా చెప్పగలిగారు.


సర్వేలు వస్తున్నా కూడా  :


ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. ఏపీలో దాదాపుగా మూడు నెలల నుంచి అన్ని రకాల సర్వేలు వస్తున్నాయి. ప్రతి సర్వే కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతోంది. తాజాగా వచ్చిన టైమ్స్  నౌ అయితే వైసీపీకి 23 ఎంపీ సీట్లు అంటోంది. అయితే ఈ సర్వేలను అటు టీడీపీలో ఎవరూ నమ్మకపోవడం వింత కాదు కానీ తటస్థులు మేధావులు, రాజకీయ విశ్లేషకులు సైతం నమ్మకపోవడమే ఇక్కడ విడ్డూరం. ఇవే సర్వేలు మోడీ ఓడిపోతారని చెబితే మాత్రం నమ్ముతున్న వీరంతా బాబు విషయంలో మాత్రం ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. 
అంటే సర్వేల కంటే కూడా బాబు రాజకీయ చాణక్యం మీదనే  అందరికీ ఉన్న నమ్మకమే అలా అనిపిస్తోందన్నమాట. బాబు ఎపుడూ ఓడిపోరు, ఆయన ఎత్తులు ఎవరికీ అర్ధం కావు, చివరి నిముషంలో కూడా ఆయన ఎగిసిలేచే తరంగాలా దూకుడుతో విజయం అందుకుంటారు. ఇదీ బాబు గురించి అందరికీ ఉన్న నమ్మకం. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు సైతం బాబు ఓడిపోతారని గట్టిగా చెప్పలేకపోవడానికి ఇదే కారణం. ఏపీలో బాగా వ్యతిరేకత టీడీపీ మీద ఉందని అంతా అంటున్నా కూడా ఆ పార్టీ జోరు తగ్గడంలేదు. వైసీపీకి ఎంతో సానుకూలత ఉందని చెబుతున్నా కూడా ఆ పార్టీ గ్రాఫ్ పెరగడం లేదు. ఇది చాలదా బాబు అంటే ఏంటో చెప్పడానికి దటీజ్ బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: