ఓ వైపు సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది. మరో వైపు రాజకీయ పార్టీలు హడావుడి పడుతున్నాయి. అంటే ముంగిట్లోకి పండుగ వచ్చేసిందన్నమాట. ప్రతీ ఎన్నికకూ ఓ విలక్షణత ఉంటుంది. ఏ ఎన్నికకు ఆ ఎన్నికే గొప్ప, ఈసారి ఎన్నికలు జీవన్మరణ సమస్య అని ప్రతీ పార్టీ చెబుతోంది. చావో రేవో అంటూ క్యాడర్ ని అలెర్ట్ చేస్తూనే ఉంటుంది.


అంతా అయోమయం :


అధికార టీడీపీలో అభ్యర్ధుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలెదని టాక్. సంక్రాంతి తరువాత తొలి జాబితా ప్రకటిస్తామని చెప్పిన బాబు ఇపుడు ఫిబ్రవరి నెలాఖరు అంటున్నారు. అంటే ఇంకా ఎక్కడా ఎంపికలు అన్నవి ఎక్కడా మొదలుకాలేదన్న మాట. విడతల వారిగా నేతలతో భేటీలు వేస్తున్నా గెలుపు గుర్రాలు తేలడంలేదన్న మాట. ఎమ్మెల్యేలకు క్లాసులు తీసుకుంటున్న బాబు జర భద్రం  అంటూ హెచ్చరికలు పంపుతున్నారు తప్ప నీవే మా క్యాండిడేట్ అని మాత్రం చెప్పడం లేదు. ఇపుడు అందుతున్న సమాచారం బట్టి చూస్తే ఈ నెలాఖరుకు కానీ మార్చి మొదటి వారం కానీ అభ్యర్ధుల ప్రకటన ఉంటుంది. అదీ మొత్తంగా ఉంటుందా. తొలి జాబితా అన్నది తేలడంలేదు.


వైసీపీలోనూ అంతే :


ఇక విపక్షం వైసీపీలో అదే సీన్  కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత 14 నెలల పాటు పాదయాత్ర చేశారు. క్షేత్ర స్థాయిలో తమ పార్టీ గురించి, అభ్యర్హ్దుల గురించి బాగా తెలుసుకున్నారు. ఇక ఆలస్యం లేకుండా జాబితాలు విడుదల చేస్తారని భావించారు అంతా. కానీ అక్కడ కూడా వడపోత బాగా జరుగుతోంది. నిన్నటి వారు నేడు లేరు. రేపు ఎవరొ వస్తారో తెలియదు. మరో మారు పీకే టీం తో సర్వేలు అంటున్నారు. అంటే వైసీపీలో చూసుకుంటే మార్చిలోనే వారు కూడా జాబితా విడుదల చేస్తారనిపిస్తోంది. అది కూడా పూర్తిగానా లేక విడతల వారీగానా అన్నది తెలియడంలేదు.


దాగుడుమూతలా :


నిజానికి మొదట్లో కొన్ని పేర్లు రెండు పార్టీలు ఖరారు చేసి జాబితాలు విడుదల చేద్దామనుకున్నా చివరి నిముషంలో డ్రాప్ అయ్యారు. దానికి కారణం ప్రత్యర్ధికి తమ బలం తెలియకూడదని, వారికి అడ్వాంటేజ్ ఇవ్వకూడదని. ఇలా వైసీపీ, టీడీపీ ఆడుతున్న దాగుడుమూతల మూలంగా ఆశావహులు నలిగిపోతున్నారు. తమకు టికెట్ల ఇక్కట్లు తీరేదెపుడంటూ వారంతా కలవరపడుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాతనే అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: