నేడు శుక్రవారం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం. అరుణ్ జైట్లీ బదులు ఈసారి పీయూష్ గోయల్ - కేంద్రం ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.  కాగా బడ్జెట్ కార్యక్రమాలు జనవరి 21న హల్వా వేడుక ప్రారంభంతో లాంఛనంగా ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది మాదిరిగానే,  రైల్వే బడ్జెట్‌ను కూడా మధ్యంతర బడ్జెట్‌తోనే కలిపి ప్రవేశడతారు.


అలాగే ఈసారి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన సంధర్భంలో ప్రస్తుత మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాత్కాలిక ఆర్ధిక మంత్రిగా ప్రవేశపెట్టనున్నారు.

Related image

సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో ఉన్న తరుణంలో కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌ అన్ని వర్గాలను ఆకర్షించేందుకేనని చెప్పవచ్చు.  ఈ మధ్యంతర బడ్జెట్‌ లో రైతులు, పేదల కోసం కొత్త పథకాల ప్రకటన ఉండవచ్చు.  జీఎస్‌టీ వ్యాపారులకు ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉండే అవకాశం ఉంది. ప్రతి బడ్జెట్ ముందు యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ స్కీమ్‌ పై చర్చలు జరుగుతాయి. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఏదో కొంత నిర్ణయించిన కనీస మొత్తంలో ఆదాయం అందించాలనే ఆలోచనే యిది. అయితే ప్రవేశ పెట్టబోయే బడ్జెత్ మధ్యంతర బడ్జెట్‌ {అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు సుమారు రెండు లేదా మూడు నెలలల కోసం} కాబట్టి ఈ అంశంపై ప్రకటన ఉండకపోవచ్చు


కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గతంలోనే కూడా ఈ అంశానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కన్నా పైస్థాయి లోనే మధ్యంతర బడ్జెట్ ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు. నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌ లో ఐదు కీలక ప్రకటనలు ఉంటాయని అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి  ఇదే చివరి బడ్జెట్.  ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్ అయినా కూడా, ఇందులో పలు కీలక ప్రకటనలు ఉండవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

 Image result for central budget 2019-20

1. రైతులకు ప్రయోజనాలు:  బడ్జెట్‌ లో రైతులకు ఊరట కలిగించే పలు ప్రకటనలు ఉండొచ్చని చాలా మంది విశ్లేషకులు, ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రైతులకు వేగంగా ఋణ మంజూరు చేయాలని తక్కువ వడ్డీరేట్లకు అందించేలాగా ప్రయత్నాలు జరగవచ్చు. "రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ" లాంటి పలుకీలక నిర్ణయాలు వెలువడొచ్చని తెలిపారు. 

 

2. పేదలకు ప్రయోజనాలు: సార్వత్రిక కనీస ఆదాయ పథకం - ఎప్పటిలాగే ప్రతి బడ్జెట్ ముందు జరిగే యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ పథకంలో పేద ప్రజలకు నిర్ణీత మొత్తంలో కొంత నగదు అందించి పేదలకు ఈ పథకం రూపంలో తాయిలాలు ప్రకటించే అవకాశముంది.

 

3. వ్యాపారవేత్తలకు ప్రయోజనాలు: బీమా పథకం - సాధారణ వ్యాపారులకు వారితో పాటు జీఎస్‌టీ కింద రిజిస్టర్ అయిన ప్రతి వ్యాపారవేత్తకు కూడా ఇన్సూరెన్స్ స్కీమ్‌ ను తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్రం కార్పొరేట్-ట్యాక్స్‌ కు సంబంధించి పలు ప్రకటనలు చేయవచ్చనే అంచనాలున్నాయి. ఫిక్కీ ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తోంది.

 

4. కస్టమ్ డ్యూటీ మార్పు: కేంద్ర ప్రభుత్వం పలు వస్తువులపై కస్టమ్ డ్యూటీ లో మార్పులు ప్రకటించే అవకాశముంది. గత కొన్ని మధ్యంతర బడ్జెట్‌ లలోనూ సుంకాల మార్పు జరిగింది. అలాగే ప్రస్తుత బడ్జెట్‌ లోనూ కస్టమ్ డ్యూటీలో మార్పులు తీసుకు రావచ్చు. 

 

5. ఉద్యోగులకు ప్రయోజనాలు: ఆదాయపు పన్ను ప్రయోజనం - కేంద్రం ఉద్యోగులకు, వేతన జీవులకు, పెన్షన్ తీసుకునే వారికి పన్ను ప్రయోజనాలు అందించవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయవచ్చనే కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ₹ 2.50 లక్షలకుపైన వార్షిక ఆదాయం కలిగి ఉంటే పన్ను చెల్లించాలి. అయితే మినహాయింపు పరిమితి పెంచితే ₹.5.00 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నా కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Image result for central budget 2019-20

మరింత సమాచారం తెలుసుకోండి: