ఒక పక్క ఎన్నికలు మరో పక్క పార్టీలో నుండి వెళ్ళిపోతున్నాను నేతలు ఇలా వరుస పెట్టి టెన్షన్ లో కూడా చంద్రబాబు చాలా కూల్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్య పార్టీ నేతలతో సమావేశాలు అవుతూ మరోపక్క రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ఆలోచిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Image result for tdp mp's in black dress in gandhi statue

ఈ క్రమంలో తాజాగా కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో పరిహారం విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైకోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్‌ చేసి అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాలని, ఆస్తుల వేలం తర్వాత ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

Related image

ప్రత్యేక హోదా, వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసులు ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సమైక్యాంధ్ర ఉద్యమం నాటి మిగిలిన కేసులు ఎత్తివేయాలని నిర్ణయించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Related image

ఈ సమావేశాల్లో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పసుపు- కుంకుమ పథకం నిధుల పంపిణీకి, చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో చంద్రబాబు తాజా క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: